పెరగనున్న జియో మొబైల్ డేటా రేట్లు

పెరగనున్న జియో మొబైల్ డేటా రేట్లు

మొబైల్ డేటా అత్యంత చౌకగా పొందుతున్న భారతీయులకి డేటా ధరలు కాస్త పెరుగునున్నాయి. 71 వేల కోట్ల నష్టాన్ని వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్ సంస్థలు పొందాయి. పెద్ద మొత్తాల్లో చెల్లించాల్సిన లైసెన్సు ఫీజులను మాఫీ చేయమని ప్రభుత్వాన్ని కోరనున్నాయి అని ఆయన చెప్పారు. ప్రభుత్వానికి టెలికాం సంస్థలు తమ వ్యాపారాన్ని నిర్వహించుకునేందుకు చెల్లించాల్సిన రుసుమే లైసెన్స్ ఫీజు.

రిలయన్స్ జియో భారతదేశంలో అత్యంత చౌకగా మొబైల్ డేటాను అందిస్తున్న సంస్థ. ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాల మాదిరిగానే రిలయన్స్ జియో ధరల్ని పెంచుతున్నట్లు తెలిపింది. ఏ మేరకు ధరాలని పెంచుతున్నదీ స్పష్టం లేదు కానీ జియో స్పష్టం తమ వ్యాపారాన్ని చక్కదిద్దుకునేందుకు డబ్బు వసూలు చేసే పనిలో ఉంది.

టెలికాం ఆపరేటర్లకు ఆదాయాన్ని ప్రభుత్వం పంచుకునే విధానం కూడా నష్టాలకు ఓ కారణం కాగా ఎయిర్‌టెల్, వొడాఫోన్‌లపై చాలా ప్రభావం పడింది. డిసెంబర్1 నుంచి పెంచుతున్న టారిఫ్‌లను అమలు చేస్తామని వొడాఫోన్ ఐడియా తెలుపగ ప్రపంచంలోకెల్లా అత్యంత తక్కువ ధరలు భారత్ లో ఉన్నాయని టారిఫ్‌ల్లో తగిన మార్పులు చేస్తాం అని ఎయిర్‌టెల్ చెప్తుంది.