నిమిషానికి 6 పైసల చార్జీల పెంపు పై జియోపై నిరసనలు వెలువెత్తాయి. ఈ నేపథ్యం లో కొత్త మంత్లీ ప్లాన్లను రిలయన్స్ జియో లాంచ్ చేసింది. ఐయూసీ కాల్స్ ఉచిత ఆఫర్‌తో మూడు రీచార్జ్ ప్లాన్లను ప్రవేశ పెట్టింది. ఈ జియో ఆల్ ఇన్ వన్ ప్లాన్స్-మూడు రీచార్జ్ ప్లాన్లద్వారా 2జీబీ డేటాను ప్రతి రోజు ఇవ్వనుంది. ఇంకా విశేషం ఏం అంటే ఇతర మొబైల్ నంబర్లకు 1,000 నిమిషాల ఉచిత టాక్ టైమ్‌ను జియో అందచేయబోతుంది. ఇదివరకిలాగే జియోటుజియో అన్లిమిటెడ్ కాలింగ్ అందుబాటులో ఉండబోనునది.
ఇంటర్‌కనెక్ట్ యూజర్ ఛార్జీ నిమిషానికి 6పైసలు జియో ప్రకటించిగా, ఒకరోజు వాలిడిటీ ఉన్న 19 రూపాయల ప్లాన్‌ను, 7రోజుల వాలిడిటీ ఉన్న 52ప్లాన్‌ను అందుబాటులో నుండి తొలగించింది.
కొత్త ప్లాన్స్ నెలకు 222 రూపాయలు, 2 నెలలకు 333 రూపాయలు, 3 నెలలకు 444 రూపాయలు ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది.