జో రూట్‌ సంచలన నిర్ణయం

జో రూట్‌ సంచలన నిర్ణయం

ఇంగ్లండ్‌ టెస్టు సారథి జో రూట్‌ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇంగ్లండ్‌ టెస్టు కెప్టెన్సీ బాద్యతల నుంచి తప్పుకుంటున్నట్లు రూట్‌ శుక్రవారం ప్రకటిం‍చాడు. యాషెస్‌ సిరీస్‌లో ఘోరపరాభవం, వెస్టిండీస్‌ పర్యటనలో ఓటమి అనంతరం రూట్‌ కెప్టెన్సీ వైదొలగాలని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే రూట్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇక వెటరన్ బ్యాటర్ అలిస్టర్ కుక్ రాజీనామా చేసిన తర్వాత 2017లో జో రూట్ ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఇంగ్లండ్‌ టెస్టు కెప్టెన్‌గా అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా రూట్‌  రికార్డు సృష్టించాడు. తన ఐదేళ్ల కెప్టెన్సీ లో ఇంగ్లండ్‌కు 27 విజయాలు అందించి అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన రికార్డును కూడా రూట్‌ కలిగి ఉన్నాడు.”నా దేశానికి కెప్టెన్‌గా వ్యవహరించినందుకు నేను చాలా గర్వపడుతున్నాను.

ఇంగ్లండ్‌ వంటి జట్టకు కెప్టెన్‌గా మరి కొంత కాలం కొనసాగాలని భావించాను. కానీ ఇటీవల కాలంలో అనూహ్య పరిణమాలు చోటు చేసుకున్నాయి. కెప్టెన్సీ ఒత్తిడి నా ఆటపై ప్రభావం చూపింది. ఇంగ్లండ్‌ తదుపరి కెప్టెన్‌గా ఎవరు ఎంపికైన నా వంతు సహాయం చేయడానికి నేను ఎప్పుడు సిద్దంగా ఉంటాను. నాకు ఇన్నాళ్లు మద్దతుగా నిలిచిన అభిమానులకు, ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డుకు దన్యవాదాలు” అని రూట్‌ పేర్కొన్నాడు.