బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం తాజాగా నటించిన యాక్షన్ మూవీ ఎటాక్. ఇటీవలే థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది. ఈ క్రమంలో నెగెటివ్ రివ్యూలను, నెగెటివ్ కామెంట్లను తానసలు పట్టించుకోనంటున్నాడు జాన్ అబ్రహం. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. ‘నా సినిమాల గురించి నెగెటివ్‌గా రాసే వార్తలను నేను పట్టించుకోను. నా ప్రతి సినిమాకు నా కెరీర్ క్లోజ్ అంటూ రాస్తారు. కానీ అలా రాసేవాళ్లలో చాలామంది రచయితగా పని ఇప్పించమని వచ్చారు. వారికి నేను చేతనైనంత సాయం చేశాను. అప్పుడు వాళ్లు సారీ చెప్పి, మీ గురించి తెలీక అలా రాశాము. ఆరోజు ఏదో చికాకులో అలా రాసేశాం అని చెప్పేవారు.’
‘బహుశా వాళ్లకు వైవాహిక జీవితంలో ఏదైనా ఇబ్బందులు ఉండొచ్చు. లైఫ్‌లో సంతోషంగా లేకపోవచ్చు, లేదంటే ఉదయాన్నే మూడ్ ఆఫ్ అయి ఉండొచ్చు అని అర్థం చేసుకునేవాడిని. అలాగే రచయితగా అవకాశం ఇప్పించమని వచ్చినప్పుడు నాకు వీలైన సాయం చేసేవాడిని. అందులో కొందరు క్రిటిక్స్ తీరు మార్చుకున్నారు, మరికొందరు ఇప్పటికీ అలాగే ఉన్నారు. ఇతర ఆర్టిస్టుల మీద పడుతూ వాళ్ల కెరీర్ ఖతమంటూ ఇంకా నెగెటివ్ రివ్యూలు రాస్తూనే ఉన్నారు’ అని చెప్పుకొచ్చాడు.