ప్రముఖ నృత్యదర్శకుడు జానీ మాస్టర్ హీరోగా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. మురళీరాజ్ తియ్యాన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా గత ఏడాది డిసెంబరులో ప్రారంభమైంది. తాజాగా హీరోగా ఇంకో ఆఫర్ అందుకున్నారు జానీ.
‘మంత్ర, మంగళ’ చిత్రాల ఫేమ్ ఓషో తులసీరామ్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి ‘దక్షిణ’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. నేడు (జులై 2) జానీ మాస్టర్ బర్త్‌డే సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రకటించారు. ‘‘ఇదొక సూపర్ నేచురల్ థ్రిల్లర్. అరకు, గోవా ఫారెస్ట్, బెంగళూరు ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుతాం’’ అన్నారు తులసీరామ్.