బిగ్‍ బాస్‍ లో సందడి చేయనున్న జానీ మాస్టర్‍

బిగ్‍ బాస్‍ లో సందడి చేయనున్న జానీ మాస్టర్‍

బిగ్‍ బాస్‍ సీజన్‍ మొదలవుతుందంటే టీవీ ప్రేక్షకులతో పాటు మీడియాకు కూడా భలే పండుగ. అసలే లాక్‍ డౌన్‍లో రాసుకోవడానికి వార్తలు లేక ఇక్కట్లు పడుతోన్న టైమ్‍లో బిగ్‍ బాస్‍ స్టార్ట్ అవుతూ వుండడంతో ఇక ఆ అప్‍డేట్స్తో బోలెడంత కాలక్షేపం దొరుకుతుందని మీడియా సంస్థలు ఎదురు చూస్తున్నాయి. షో మొదలయ్యే లోగా ఈ సీజన్లో పాల్గొనే కంటెస్టెంట్ల వివరాలు లీక్‍ అవుతున్నాయి. నిజంగానే వాళ్లు షోలో వుంటారో, లేక ఊహాగానాలో వారిని నాగార్జున స్వయంగా ఇంట్రడ్యూస్‍ చేసే వరకు తెలీదు.

అయితే ఈ ఏడాది తక్కువ మంది కంటెస్టెంట్స్ వున్నా గట్టి వాళ్లను, బాగా ఎంటర్‍టైన్‍ చేసే వాళ్లను పెడుతున్నారని టాక్‍. ప్రతి సీజన్‍లానే ఈసారి కూడా డాన్స్ మాస్టర్‍తో పాటు ఒక సింగర్‍ కూడా హౌస్‍లోకి వెళుతున్నారు. ఆ డాన్స్ మాస్టర్‍ మరెవరో కాదు… జానీ అని చెబుతున్నారు. ప్రస్తుతం లీడింగ్‍ కొరియోగ్రాఫర్‍ అయిన జానీ మామూలుగా అయితే ఈ హౌస్‍లోకి వెళ్లేంత తీరిగ్గా వుండడు. కానీ ఇప్పుడు షూటింగ్స్ లేవు కనుక అతడు అభ్యంతరం చెప్పలేదని అంటున్నారు.

అలాగే యాక్టర్‍ కమ్‍ సింగర్‍ నోయెల్‍ కూడా ఈ సీజన్లో తన హుషారయిన పాటలతో హౌస్‍లో అలరిస్తాడట. లేడీ కంటెస్టెంట్స్ కూడా చాలా పాపులర్‍ ఫేసెస్‍ వుంటాయని అంటోన్న నేపథ్యంలో ఈ సీజన్‍పై ఉత్కంఠ మరింత పెరుగుతోంది.