పొద్దున్నే తొమ్మిదింటికే రాఘవుడు వచ్చేస్తాడు…!

Jr NTR Aravinda Sametha Teaser To Release On Aug 15

జూనియర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ వస్తున్న తాజా చిత్రం ‘అరవింద సమేత’. తోలి సారి క్రేజీ కాబినేషన్ కావడంతో మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. సినిమా టీజర్ ప్రకటనలో భాగంగా మూవీ యూనిట్ అరవింద సమేత టీజర్‌ను స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15వ తేదీన విడుదల చేయనున్నారని ప్రకటించింది.

Jr NTR Aravinda Sametha Teaser To Release On Aug 15

కానీ ఇప్పుడు ఏ టైంలో రిలీజ్ చేస్తున్నారో కూడా చెప్పింది మూవీ యూనిట్. జెండావందనం అనంతరం ఆగస్టు 15 ఉదయం 9 గంటలకు అరవింద సమేత టీజర్ విడుదలకానుందని చిత్రబృందం తెలిపింది. ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా.. కీలక పాత్రల్లో జగపతిబాబు, నాగబాబు తదితరులు నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని హారిక-హాసిని క్రియేషన్స్ బ్యానర్‌ఫై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.