Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
Jr NTR BIG BOSS Show New Promo
తెలుగు ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘బిగ్‌బాస్’ షో అతి త్వరలోనే ప్రారంభం కాబోతుంది. ఇందుకోసం స్టార్ మాటీవీ ముంబయిలో ఒక ఇంటిని ప్రత్యేకంగా ముస్తాబు చేస్తుంది. ఇక టాలీవుడ్ నుండి పలువురు సెలబ్రెటీలను కూడా ఈ షో కోసం ఎంపిక చేయడం కూడా జరిగి పోతుంది. ఇప్పటికే ఈ షోకు సంబంధించి ఎన్టీఆర్ లుక్‌ను రివీల్ చేయడం, ఒక టీజర్‌ను కూడా విడుదల చేయడం జరిగింది. ఎన్టీఆర్ లుక్ ఆకట్టుకోవడంతో షోపై అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు స్టార్ మాటీవీ మరో సర్ప్రైజ్ ఇచ్చింది.
ఎన్టీఆర్‌తో కొత్త ప్రోమోను సిద్దం చేసి విడుదల చేయడం జరిగింది. ఎన్టీఆర్ బెడ్ మీద పడుకుని, అలారం మోగగానే లేచి, కాఫీ అందుకుని తాగుతూ ఉంటాడు. ఆ సమయంలోనే చుట్టు ఉన్న కెమెరాలను చూసి షాక్ అవుతాడు. కెమెరాలు పెట్టమన్నది బిగ్ బాస్ హౌస్‌లో నా హౌస్‌లో కాదు అంటూ ఎన్టీఆర్ కామెడీగా చెప్పిన డైలాగ్ అందరిని ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం జై లవకుశ చిత్రంతో బిజీగా ఉన్నా కూడా ఎన్టీఆర్ బిగ్ బాస్ షోకు టైంను కేటాయిస్తూ ఉన్నాడు. జై లవకుశ చిత్రం పూర్తి చేసిన తర్వాత పూర్తి స్థాయిలో బిగ్ బాస్ షోను హోస్ట్ చేయబోతున్నాడు. తెలుగు వెండి తెరపై తనదైన మార్క్‌ను క్రియేట్ చేసిన ఎన్టీఆర్ ఇప్పుడు బుల్లి తెరపై ఎలా ఆకట్టుకుంటాడు అనేది చూడాలి. జులై చివర్లో బిగ్‌బాస్ షో ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయని స్టార్ మా వర్గాలు అంటున్నారు.
మరిన్ని వార్తాలు: