Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
స్టార్ మా టీవిలో బిగ్ బాస్ కి హోస్ట్ చేయబోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి పెద్ద షాక్ తగిలింది. ఊహించని అనుభవం ఎదురైంది. ఓ రోజు తెల్లవారి లేచి చూసేసరికి బెడ్ రూమ్ నిండా కెమెరాలు కనిపించేసరికి ఎన్టీఆర్ ఉలిక్కి పడ్డాడు. మీరు మాత్రం ఎన్టీఆర్ కి ఏమైందో అని ఉలిక్కిపడకండే. ఇదంతా బిగ్ బాస్ ప్రమోషన్ కోసం తీసిన ఓ యాడ్ లో భాగం మాత్రమే.
తమిళనాడులో ఇదే కార్యక్రమాన్ని సీనియర్ నటుడు కమల్ హాసన్ చేస్తున్నారు. ఇప్పటికే ఆ షో తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయ్యింది ఒకటిరెండు ఎపిసోడ్లు మాత్రమే కావడంతో జనం నుంచి మిక్సెడ్ టాక్ వినిపిస్తోంది. ఆ ఫీడ్ బ్యాక్ ని కూడా దృష్టిలో ఉంచుకుని తెలుగులో ఈ కార్యక్రమాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దడానికి స్టార్ టీం ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా కొద్దిసేపటి కిందట బిగ్ బాస్ ప్రోమో విడుదల చేసింది. ఆ ప్రోమో ఇప్పుడు మీకోసం…