కొడుకు ఫొటో షేర్‌ చేసిన ఎన్టీఆర్‌ !

Jr NTR post his Second Son photo

 

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ రెండోసారి తండ్రి అయిన సంగతి తెలిసిందే. అయితే కాకతాళీయంగా అంతకు ముందు రోజే ఆయన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా తెరిచారు. అయితే ముందుగా అరవింద సమేత ఫస్ట్ లుక్ ను పోస్ట్ చేసిన ఎన్టీఅర్ కొడుకు పుట్టగానే అది తీసేసి కుమారుడి పిక్ నే పోస్ట్ చేద్దామనుకున్నారు. అయితే అంతకు ముందే ఒక ఫోటో ఇదే ఎన్టీఆర్ రెండో కుమారుడి పిక్ అని నెట్ లో హాల్ చల్ చేయగా చివరికి అది ఫేక్ పిక్ అని తేలింది.

అయితే ఈరోజు పదింటికి ఇన్‌స్టాలో తొలి సారిగా తన ఇద్దరు కుమారుల ఫొటోను ఎన్టీఆర్‌ షేర్‌ చేశారు. ఎన్టీఆర్ పెద్ద కుమారుడు అభయ్ తన బుల్లి తమ్ముడిని ఒడిలో పెట్టుకున్నాడు. ఈ దృశ్యాన్ని ఎన్టీఆర్ తన ఫోన్‌లో క్లిక్ మనిపించాడు. దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసిన ఎన్టీఆర్.. ‘‘బ్రాట్‌ప్యాక్‌లోకి వచ్చిన కొత్త బ్రాట్‌కు స్వాగతం. ఇన్నోసెంట్ మామ్ ఈ ఫొటో తీసింది’’ అంటూ కామెంట్ పెట్టాడు. కాగా ఎన్టీఆర్ తన రెండో కుమారుడికి ఏ పేరు పెడతాడో అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.