ఎన్టీఆర్‌కు పోటీగా రానా?

Raana To Get Competition From Jr NTR

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హోస్ట్‌గా స్టార్‌ మాటీవీ బిగ్‌బాస్‌ షోను ప్రారంభించబోతున్న విషయం తెల్సిందే. తాజాగా బిగ్‌బాస్‌ షో ఎన్టీఆర్‌ లుక్‌ కూడా రివీల్‌ అయ్యింది. లుక్‌తోనే బుడ్డోడు దుమ్ము రేపాడు. ఇక షోతో టీఆర్‌పీ రేటింగ్‌లు బద్దలు కావడం ఖాయం అంటున్నారు. ఈ సమయంలోనే రానా కూడా ఒక సెలబ్రెటీ షోతో జెమిని టీవీలో వచ్చేందుకు సిద్దం అయ్యాడు. తాజాగా జెమిని టీవీ ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు. రానా కొన్ని రోజుల క్రితం ఒక టెలివిజన్‌ షో చేస్తున్నట్లుగా ప్రకటించాడు. అది ఏంటి, ఏ ఛానెల్‌లో వస్తుందనే విషయంపై క్లారిటీ వచ్చింది.

జెమిని టీవీలో ‘నెం.1 యారి విత్‌ రానా’ అనే షో ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే కొన్ని ఎపిసోడ్స్‌ను కూడా చిత్రీకరించడం జరిగింది. త్వరలోనే టీజర్‌ను విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. ఎన్టీఆర్‌ ‘బిగ్‌ బాస్‌’ షో ప్రకటించిన తెల్లారే రానా టాక్‌ షో ‘నెం.1 యారి విత్‌ రానా’ను ప్రకటించడం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది. మాటీవీతో జెమినిటీవీకి ఉన్న పోటీతోనే ఎన్టీఆర్‌ షోకు రానా షోను పోటీగా దించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఎన్టీఆర్‌ షో ప్రారంభం అవ్వడానికి కాస్త సమయం పట్టే అవకాశం ఉంది. అయితే ఈలోపు రానా ఫన్‌ టాక్‌ షో ప్రారంభం అవుతుందా అనేది చూడాలి. బుల్లి తెరపై ఎన్టీఆర్‌కు పోటీ ఇవ్వగల సత్తా రానాకు ఉందా అనేది అనుమానమే. బుల్లి తెరపై ఎన్టీఆర్‌ తిరుగులేని రికార్డులు సొంతం చేసుకోవడం ఖాయం అని నందమూరి అభిమానులు ఎంతో ధీమాగా ఉన్నారు.