యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరోసారి తండ్రి అయ్యాడు. నాలుగు సంవత్సరాల క్రితం తండ్రి అయిన ఎన్టీఆర్ తాజాగా మరోసారి తండ్రి అయ్యాడు. మొదట కొడుకు పుట్టగా అభయ్ రామ్ అంటూ పేరు పెట్టిన ఎన్టీఆర్, తన భార్య రెండవ సారి గర్బవతి అని తెలియగానే కూతురు పుట్టాలని కోరుకున్నాడు. కూతురు పుడితే ఏం పేరు పెట్టాలో కూడా ఫిక్స్ అయ్యాడు. ఈ సమయంలో ఎన్టీఆర్ ఆశలు నీరుగారేలా మళ్లీ కొడుకు పుట్టాడు. ఇటీవల ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ తనకు కూతురు కావాలని కోరికగా ఉందని, తన భార్య కూడా కూతురు కోసం ఎదురు చూస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు. మొదట కొడుకు పుట్టిన అల్లు అర్జున్‌కు ఆ వెంటనే కూతురు పుట్టిన విషయం తెల్సిందే. అదే విధంగా తనకు కూడా కూతురు కావాలని ఎన్టీఆర్ చాలా ఆశ పడ్డాడు.
నందమూరి ఫ్యామిలీలో ఆడపడుచుగా తన కూతురు ఉండాలని ఎన్టీఆర్ కోరుకున్నాడు. కాని తనకు ఆడ పడుచు లేకుండానే అయ్యిందని కాస్త బాధను ఎన్టీఆర్ వ్యక్తం చేస్తున్నట్లుగా సన్నిహితులు చెబుతున్నారు. ఎన్టీఆర్ రెండవ కొడుకు పుట్టినా కూడా పర్వాలేదు అని మొదటి నుండి అనుకుంటూ వస్తున్నా కూడా కూతురు పుడితే బాగుండు అని అనుకుంటున్న మాట వాస్తవం అంటూ ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే ఒక వ్యక్తి చెబుతున్నాడు. మొత్తానికి ఏది అనుకుంటామో అది జరగక పోవడమే జీవితం. ఎంత సెలబ్రెటీ అయినా, స్టార్ అయినా విధిరాతను మార్చడం సాధ్యం కాదని తేలిపోయింది. ఎన్టీఆర్‌కు మళ్లీ కొడుకు అయిన సందర్బంగా ఆయనకు ఆర్ధిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.