నిర్మాతలను కుక్కలతో పోల్చి చిక్కుల్లో పడ్డ స్టార్‌ కెమెరామన్‌…!

JSK Satish Lashes Out At Santosh Sivan For Meme

తమిళ ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ సంతోష్‌ శివన్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఒక ఇమేజ్‌ ప్రస్తుతం తమిళ నాట పెను దుమారంను రేపుతుంది. నిర్మాతలను ఉద్దేశించి ఈయన పెట్టిన ఒక మెమె పెను వివాదంకు తెర తీసింది. ఈయన్ను తమిళ సినిమా పరిశ్రమ నుండి బ్యాన్‌ చేయాల్సిందే అంటూ నిర్మాతలు అంతా కూడా ముక్త కంఠంతో అంటున్నారు. మరో వైపు ఈయన చేసిన తప్పును క్షమించాలని అభిమానులు మరియు కొందరు సినీ వర్గాల వారు కోరుతున్నారు.

photographer

ఇంతకు సంతోష్‌ శివన్‌ చేసిన పోస్ట్‌ ఏంటీ అంటే.. రెండు కుక్కల ఫొటోలను పోస్ట్‌ చేసిన ఈయన కోపంగా చూస్తున్న కుక్క ఫొటోకు టెక్నీషియన్స్‌కు పారితోషికం ఇచ్చే సమయంలో నిర్మాతల రియాక్షన్‌ ఇది అని, నవ్వుతూ ఉన్న కుక్క ఫొటోకు హీరోయిన్స్‌కు పారితోషికం ఇచ్చే సమయంలో నిర్మాతల రియాక్షన్‌ ఇది అంటూ కామెంట్‌ చేయడం జరిగింది. నిర్మాతలను కుక్కలతో పోల్చడంతో పాటు, పారితోషికం విషయంలో నిర్మాతలు టెక్నీషియన్స్‌ విషయంలో ఇబ్బంది పెడుతారు అంటూ ఆయన ఆరోపించడంతో సినీ వర్గాల వారు తీవ్రంగా పరిగణిస్తున్నారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన సంతోష్‌ శివన్‌ తన స్థాయికి తగ్గట్లుగా కాకుండా దారుణమైన కామెంట్స్‌తో పోస్ట్‌ పెట్టాడని ఆగ్రహం వ్యక్తం అవుతుంది. ఈయన విషయంలో నేడు తమిళనాడు నిర్మాతల మండలి చర్చించబోతుంది. ఈయన కెరీర్‌ ఎలాంటి మలుపు తిరుగుతుందో రాత్రి వరకు తేలిపోయే అవకాశం ఉంది.

santhosh