త్రివిక్రమ్‌ను ఒప్పించే ప్రయత్నం చేస్తున్న ఎన్టీఆర్‌

junior ntr request to director trivikram srinivas

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకుడిగా కెరీర్‌ ఆరంభించినప్పటి నుండి కూడా పలు సూపర్‌ హిట్‌ చిత్రాలు తీశాడు. ‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాలు ఫ్లాప్‌ అయినా కూడా త్రివిక్రమ్‌ మార్క్‌ కనిపించింది. ఆ సినిమాలు ఇప్పుడు బుల్లి తెరపై భారీ విజయాన్ని సాధించాయి. కాని తాజాగా పవన్‌ కళ్యాణ్‌తో చేసిన ‘అజ్ఞాతవాసి’ చిత్రం మాత్రం బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడటం జరిగింది. ఇదో త్రివిక్రమ్‌ సినిమా అంటే కొందరు నమ్మే పరిస్థితి లేదు. త్రివిక్రమ్‌ మార్క్‌ ఎక్కడ కనిపించలేదు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. త్రివిక్రమ్‌ సినిమాలు ఎక్కువగా మ్యూజికల్‌ సక్సెస్‌ను సాధించాయి. దేవిశ్రీ ప్రసాద్‌తో విభేదాల కారణంగా త్రివిక్రమ్‌ అజ్ఞాతవాసికి తమిళ సంగీత దర్శకుడు అనిరుథ్‌ను బరిలోకి దించాడు.

అనిరుథ్‌ సంగీతం పవన్‌ ఫ్యాన్స్‌ను మరియు ప్రేక్షకులను ఫిదా చేయడంలో దారుణంగా విఫలం అయ్యింది. ఏమాత్రం ఆకట్టుకోలేక పోవడం, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ కూడా గొప్పగా లేకపోవడంతో సినిమా మరింత ఫ్లాప్‌ అయ్యింది. త్రివిక్రమ్‌ వచ్చే నెల నుండి ఎన్టీఆర్‌ హీరోగా ఒక చిత్రాన్ని చేయబోతున్నాడు. ఆ సినిమాకు కూడా అనిరుథ్‌ను ఇప్పటికే సంగీత దర్శకుడిగా ఎంపిక చేయడం జరిగింది. కాని ఇప్పుడు ఎన్టీఆర్‌ ఆలోచనలో పడ్డట్లుగా తెలుస్తోంది. ముందు నుండి అనుకున్నట్లుగానే కథ, కథనంతో సినిమా చేసేద్దాం, కాని అనిరుథ్‌ స్థానంలో దేవిశ్రీ ప్రసాద్‌ను సంగీత దర్శకుడిగా తీసుకుందాం అంటూ ఎన్టీఆర్‌ స్వయంగా దర్శకుడు త్రివిక్రమ్‌ను రిక్వెస్ట్‌ చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది.

అనిరుథ్‌కు తెలుగులో టైం బాగోలేదు. ఆయన ఎంట్రీ సరిగా లేదు. దాంతో ఎన్టీఆర్‌ ఆయనతో వర్క్‌ చేసేందుకు కాస్త వెనుక ముందు ఆడుతున్నాడు. అయితే త్రివిక్రమ్‌ మాత్రం దేవిశ్రీ ప్రసాద్‌తో వర్క్‌ చేసేందుకు ఇష్టపడటం లేదని సమాచారం అందుతుంది. మరి కొన్ని రోజుల్లో ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ల కాంబో మూవీ దర్శకుడిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.