పవన్‌ 26వ సినిమా లేదా? అసలు మ్యాటరేంటి?

no clarity on Pawan Kalyan 26th movie Over 2019 Elections

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

పవన్‌ కళ్యాణ్‌ గతంలో పలు సార్లు తనకు సినిమాలు అంటే ఆసక్తి లేకుండానే ఇండస్ట్రీకి వచ్చాను అంటూ చెప్పుకొచ్చాడు. డబ్బుల కోసం తాను సినిమాలు చేస్తున్నట్లుగా పలు వేదికలపై పవన్‌ చెప్పుకొచ్చాడు. ఆసక్తి లేకుండా చేస్తున్న సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడుతున్నాయి. అలాంటి సమయంలో సినిమాలు చేయాల్సిన అవసరం ఏంటీ అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. పవన్‌కు సినిమాలు అంటే ఆసక్తి లేదు, రాజకీయాల్లో పెను మార్పులు తీసుకు వచ్చి, ప్రజల పక్షంలో నిలవాలనేది ఆయన కోరిక. ఇష్టం ఉన్నట్లుగానే చేస్తే బాగుంటుందని, ఇక పవన్‌ ఇప్పటికి అయినా సినిమాలకు దూరంగా ఉండాలని కొందరు భావిస్తున్నారు.

పవన్‌ వరుసగా సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌, కాటమరాయుడు, అజ్ఞాతవాసి ఇలా ఫ్లాప్‌ అవుతూ వస్తున్నాయి. ముందు ముందు సినిమాలు చేసినా కూడా ఏదో ఒక్కటి సక్సెస్‌ అయితే మళ్లీ ఫ్లాప్‌ల పరంపర కొనసాగే అవకాశాలున్నాయి. అలాంటి సమయంలో పవన్‌ ఎందుకు ఇంకా సినిమాల్లో కొనసాగాలి అంటూ ప్రశ్నిస్తున్నారు.

పవన్‌ 25వ చిత్రంతో సినిమాలకు గుడ్‌ బై చెబితే బాగుంటుందని, పవన్‌ ఆసక్తిలేని రంగంలో రాణించడం కష్టం అని, ఇన్నాళ్లు ఆయన్ను ఏదో శక్తి నడిపించింది, ఆయన వెంట ఇంత మంది నిలిచేలా చేసిందని, ఇప్పటికైనా పవన్‌ తన జీవితాన్ని ప్రజలకు పూర్తిగా అంకితం చేయాలని కొందరు పవన్‌ ఫ్యాన్స్‌ అంటున్నారు. 2019 ఎన్నికలకు మరెంతో దూరం లేని కారణంగా సినిమాలను పక్కన పెట్టి పార్టీని బలోపేతం చేయడంపై పవన్‌ దృష్టి పెట్టే అవకాశం ఉందని ఆయన సన్నిహితులు కొందరు అంటున్నారు. మొత్తానికి పవన్‌ 26వ చిత్రం ఉంటుందా ఉండదా అనే విషయమై సినీ వర్గాలతో పాటు, ప్రేక్షకుల్లో కూడా ఆసక్తికర చర్చ జరుగుతుంది.