12 డిసెంబర్ 16న అర్ధరాత్రి 23 ఏళ్ల విద్యార్థినిపై కదులుతున్న బస్సులో ఆరుగురు మృగాళ్లు అత్యాచారానికి పాల్పడి… ఆ పై ఆమెను ఆమె స్నేహితుడిని రోడ్డు మీదకు విసిరేశారు. ప్రాణాల కోసం పోరాడి చివరకు ఆ యువతి సింగపూర్‌లోని ఓ ఆస్పత్రి లో కన్నుమూసింది. ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితులు రామ్‌సింగ్ అక్షయ్ వినయ్ శర్మ పవన్ ముఖేశ్ మైనర్ అయిన మరో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం రామ్ సింగ్ 2013 మార్చిలో తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకోగా మరో నిందితుడు మైనర్ కావడంతో మూడేళ్ల శిక్ష తర్వాత విడుదలయ్యాడు. ఇక మిగిలిన నలుగురికి అనేక సార్లు ఉరి శిక్ష ఖరారు చేయడం ..ఆ తరువాత మళ్లీ స్టే ఇవ్వడం ఇదే వ్యవహారం గత కొన్నేళ్లు గా కొనసాగుతూనే ఉంది.
దీనిపై తాజాగా నిర్భయ తల్లి తనమనోవేదనని తెలియజేసింది. నాకు చావు అంటే భయం లేదు. నా కూతురి పై ఆ మృగాళ్లు అత్యాచారం చేసిన రోజే నేను చచ్చిపోయాను. ఇప్పుడు కూడా నేను వాళ్లను నిందించాలనుకోవడం లేదు. న్యాయ వ్యవస్థలోని లొసుగులు అడ్డుపెట్టుకుని శిక్ష నుంచి తప్పించుకోవాలని చూస్తున్న తీరును విమర్శిస్తున్నా’’ అని నిర్భయ తల్లి ఆశాదేవి చెప్పుకొచ్చారు. అనేక వాయిదాలు స్టే ల తర్వాత నిందుతులకి మార్చి 20న ఉదయం 5.30 గంటలకు ఉరి తీయాలంటూ ఢిల్లీ కోర్టు గురువారం ఆదేశించిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ..మానవ హక్కుల పేరిట దోషులను రక్షిస్తున్నారంటూ విమర్శించారు. మరోసారి నిర్భయ దోషుల ఉరి అమలు వాయిదా పడితే న్యాయ వ్యవస్థ పై నమ్మకం పోయే అవకాశాలు ఉన్నాయంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.