గుంటూరు జిల్లా అమరావతి టౌన్ షిప్‌లో దారుణ హత్యకు గురైన జ్యోతి మర్డర్ కేసును పోలీసులు చేధించే పనిలో పడ్డారు. అయితే ఆమెను పక్కా ప్రణాళిక ప్రకారమే ప్రియుడు శ్రీనివాస్ హత్య చేయించాడని పోలీసులు భావిస్తున్నారు. ఓ పథకం ప్రకారమే శ్రీనివాస్ జ్యోతిని హత్య చేయించాడన్న నిర్ధారణకు వచ్చారు. ప్రస్తుతం శ్రీనివాస్ ఆస్సత్రిలో చికిత్స పొందుతుండటంతో అతడు డిశ్చార్జ్ అయిన వెంటనే అరెస్ట్ చేసేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ప్రియుడు శ్రీనివాస్ తో కలిసి జ్యోతి బైక్ మీద అమరావతి టౌన్ షిప్ ప్రాంతానికి వెళ్లింది. అక్కడ ఇద్దరు ఉన్న సమయంలో జ్యోతి మీద గ్యాంగ్ రేప్ జరిగినట్టు ప్రియుడ్ని కొట్టి జ్యోతిపై కొందరు అఘాయిత్యానికి పాల్పడ్డారని పోలీసులకి సమాచారం అందింది. తీవ్రగాయాలపాలైన జ్యోతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది.
ఈ కేసులో ఇప్పటివరకు శ్రీనివాస్ స్నేహితులు శశి, పవన్ అనే ఇద్దరు యువకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ హత్యకు వారం రోజుల ముందు రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తుంది. అమరావతి టౌన్ షిప్ ప్రాంతం నిర్మానుష్యంగా ఉండటం అక్కడ జనసంచారం పెద్దగా లేకపోవడంతో జ్యోతిని అక్కడకు తీసుకురావాలని శ్రీనివాస్‌కు వీరే చెప్పారని పోలీసులు భావిస్తున్నారు. తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తుండటంతోనే జ్యోతిని వదిలించుకునేందుకు శ్రీనివాసే హత్యకు ప్లాన్ వేశాడని పోలీసులు చెబుతున్నారు. జ్యోతిని కలిసే ముందు శ్రీనివాస్ సెల్ ఫోన్ నుంచి వీరద్దరికీ కాల్స్ వెళ్లినట్లు గుర్తించారు. ప్రియుడి ముందే అతని స్నేహితులే ఆమె మీద అఘాయితం చేయగా ఆ తర్వాత తీవ్రంగా కొట్టి హత్య చేశారు.