తెలంగాణాలో ప్రతిపక్షం ప్రజాపక్షమా ? కేసీఆర్ పక్షమా…?

KCR Makes Son TRS Working President To Focus On National Politics

రెండో సారి తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ ప్రతిపక్ష పార్టీలు నోరెత్తితే సంగతి చూస్తాననే రీతిలో హెచ్చరికలు జారీ చేశారు. గత ప్రభుత్వాల హయాంలో రాష్ట్రాన్ని దోచుకున్న దొంగల భరతం పడతానని, వారి నుంచి మింగిన సొమ్మును కక్కిస్తానని స్పష్టం చేశారు. అయితే ఈ నాలుగున్నరేళ్ల కాలంలో ఈ భారతం పట్టడాలు లాంటివి ఎందుకు చేయలేదో ఇప్పుడు ఎందుకు చేస్తున్నారో రాజకీయాల్లో ఉన్నవారందరికీ అర్ధమవుతోంది. ఆయన దృష్టి ప్రధానంగా కాంగ్రెస్ నేతల మీదే ఉంది. వైఎస్ హయాంలో అనేక శాఖల్లో పనిచేసిన మంత్రులు అవినీతికి పాల్పడ్డారనేది కేసీఆర్ వాదన. పలు ప్రచార సభల్లో కూడా ఇదే చెప్పి తాను రాగానే అప్పటి మాజీలని జైలుకు పంపుతానని కూడా ప్రకటించారు. అయితే తాజాగా రెండో సారి గెలిచిన తర్వాత తన మాటల్లో పదజాలం మరింతగా పరుషంగా మార్చారు. ఎవరు పడితే వాళ్లు కుక్కలు మొరిగినట్టు మొరిగితే ఊరుకోమని దానికి ట్రీట్‌మెంట్‌ తప్పనిసరిగా ఉంటుందని హెచ్చరించారు. ఎవడెవడు ఏం మేసిండో అన్నీ తెలుసు. వాటిని కక్కిస్తామని ఓటుకు నోటు విచారణ కూడా జరుగుతోందని హెచ్చరికలు పంపారు.

Kcr Decision Pending On 5 Constituency Seats In Telangana

తన చర్యలు అప్రజాస్వామికంగా ఉంటాయనే చెప్పుకొచ్చారు. తాను కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటాననని అది మీకు అప్రజాస్వామికం అనిపిస్తే నేనేం చేయలేనని క్లారిటీ ఇచ్చేసారు. ఓ రకంగా కేసీఆర్ తన ప్రభుత్వంపై విమర్శలు చేస్తే ఊచలు లెక్క పెట్టాల్సిందే అని హెచ్చరికలు పంపారు. దీనికి ప్రతిగా మనుషుల అక్రమ రవాణా కేసులో ఎన్నికలకు ముందు జైలుకెళ్లిన సంగారెడ్డి కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తాను నాలుగేళ్లు కేసీఆర్ పై, ఆయన కుటుంబంబై విమర్శలు చేయబోనని ప్రకటించారు. కావాలంటే ఆయనతో యాభై సార్లు భేటీ అయి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటాగానీ విమర్శలు మాత్రం చేయనని అంటున్నారు. అసలే కాంగ్రెస్‌లో గెలిచిన సీనియర్లు తక్కువ. ఉత్తమ్, భట్టి, శ్రీధర్ బాబు, సబితా ఇంద్రారెడ్డి లాంటి సీనియర్లు మాత్రమె గెలిచారు. కేసీఆర్ హెచ్చరికలతో వీరు ఎంత మంది కేసీఆర్ ప్రభుత్వంపై పోరాడతారన్నది ఆనుమానాస్పదంగానే ఉంది. కేసీఆర్ ఏం చేసినా మనం మాట్లడలనటే మద్దతిచ్చే వారు ఎవరూ ఉండరన్న భావనకు లోనైతే వీరు కూడా సైలెంట్ కావొచ్చు. మొత్తానికి తెలంగాణలో ప్రతిపక్షం ఉంటుందా ? అనే అనుమానాలు వ్యక్తమవుతున్న్నాయి.