కాదలి… తెలుగుబుల్లెట్ రివ్యూ

kaadhali Telugu movie review and Rating

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

నటీనటులు : పూజ దోషి, సాయి రోనక్, హరీష్ కళ్యాణ్
దర్శకుడు : పట్టాభి ఆర్. చిలుకూరి
నిర్మాత : పట్టాభి ఆర్. చిలుకూరి
మ్యూజిక్ డైరెక్టర్ : ప్రవీణ్ శ్యామ్

కథ..

“కాదలి” సినిమా టైటిల్ లాగానే కథ లో కూడా ఓ కొత్త పాయింట్ వుంది. ఇప్పటికే ఎన్నో సార్లు తెలుగు వెండితెర మీద ముక్కోణపు ప్రేమకథలు వచ్చాయి. వాటిలో మెజారిటీ ఒక అమ్మాయిని ఇద్దరు అబ్బాయిలు ప్రేమించడం. కాదలి లో ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిల్ని ప్రేమించడం మొదలైతే ఏ పరిస్థితి ఎదురవుతుంది? ఆ అమ్మాయి చివరికి ఎవరికి దక్కుతుంది అన్నదే కాదలి సినిమా కథ.

భాండవి అనే ఓ యంగ్ లేడీ డాక్టర్ కి వెంటనే పెళ్లి చేయాలని ఆమె తల్లి తపన పడుతుంటుంది. భాండవి కూడా తనకు ఎవరు నచ్చుతారా అని వెదుకుతుంటుంది. ఈ క్రమంలో ఆమెకి ఒకరు కాదు ఇద్దరు అబ్బాయిలు నచ్చుతారు.కార్తీక్,క్రాంతి అనే ఆ ఇద్దరు యువకుల ప్రవర్తన ఆమెని ఆకట్టుకుంటుంది.కానీ ఈ ఇద్దరిలో ఎవరిని పెళ్లి చేసుకోవాలో భాండవి తేల్చుకోలేకపోతుంది. భిన్నమైన నేపధ్యం నుంచి వచ్చిన వారిలో ఆమె ఎవరిని ఎంచుకుంది ?చివరకు ఆమె ఏ నిర్ణయం తీసుకుందన్నదే “కాదలి”.

విశ్లేషణ..

పూజ దోషి, సాయి రోనక్, హరీష్ కళ్యాణ్ అనే కొత్త నటులు తెలుగు తెరకు ఈ సినిమాతో పరిచయం అయ్యారు. పూజ దోషి యాక్టింగ్ సూపర్బ్ అని చెప్పుకోవాలి. ఆమె నవ్వు, స్క్రీన్ ప్రెజన్స్ బాగుంది. అయితే డైలాగు చెప్పేటప్పుడు ముఖ కవళికలు మీద కాస్త దృష్టి పెడితే బాగుంటుంది. ఇక సాయి రోనక్ అన్ని విభాగాల్లో అదరగొట్టాడు.తెలుగు తెరకి ఇంకో మంచి యంగ్ హీరో దొరికినట్టే. హరీష్ కళ్యాణ్ అందగాడు అయినప్పటికీ యాక్టింగ్ స్కిల్స్ ఇంకాస్త మెరుగు పరుచుకుంటే బాగుంటుంది.

ఈ ముగ్గురిని ప్రధాన పాత్రల్లో ఎంచుకుని ఓ కొత్త పాయింట్ ని కథ గా తీసుకున్న దర్శకుడు పట్టాభి ఆర్ .చిలుకూరి మాత్రం కధనం మీద దృష్టి పెట్టలేదనిపిస్తుంది. మార్తాండ్ కె. వెంకటేష్ లాంటి ఎడిటర్, శేఖర్ వి.జోసెఫ్ లాంటి సీనియర్ కెమెరా మెన్ ఉండి కూడా ఈ సినిమాని ఒడ్డున పడెయ్యలేకపోయారంటే కధాకధనాల్లో పరమ రొటీన్ విషయాలు చాలా వున్నాయి.కొత్త సంగీత దర్శకుడు ప్రవీణ్ శ్యామ్ పనితనం బాగుంది .కొత్త దర్శకుడు అనగానే సరికొత్త ఆలోచనల్ని తెర మీద ఆవిష్కరించడానికి వస్తాడని భావిస్తాడు ప్రేక్షకుడు. కాదలి సినిమాకి ఇచ్చిన పబ్లిసిటీ,పనిచేస్తున్న సీనియర్ టెక్నిషియన్స్ ని చూస్తుంటే సినిమాలో ఏదో విషయం ఉందనిపించింది.కానీ థియేటర్ లోకి వెళ్లి కూర్చున్నాక అదే పాత సినిమా ఇంకోసారి ఇంకో రకంగా చూస్తున్నట్టే అనిపించింది.అదే కాదలి కి పెద్ద మైనస్ పాయింట్

కాదలి ప్లస్ పాయింట్స్ ..

ఫోటోగ్రఫీ
సంగీతం
హీరోయిన్ పూజ దోషి

మైనస్ పాయింట్స్

రొటీన్ కథాకథనాలు
సాగదీత సన్నివేశాలు,క్లైమాక్స్

తెలుగు బులెట్ పంచ్ లైన్ .. “కాదలి” ఒకప్పటి కడలిని తలపిస్తుంది.
తెలుగు బులెట్ రేటింగ్ … 2 .25 /5 .