వైవిధ్యమైన పాత్రలు చేస్తూ ఒకవైపు వెర్సటైల్ యాక్టర్‌గా, హీరోగా గుర్తింపు దక్కించుకున్న యాక్టర్ సత్యదేవ్. ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఆయన కథానాయకుడిగా నటిస్తోన్న చిత్రాల్లో ‘గాడ్సే’ ఒకటి.ఇది వరకు సత్యదేవ్‌తో ‘బ్లఫ్ మాస్టర్’ సినిమాను రూపొందించిన దర్శకుడు గోపి గణేష్ పట్టాబి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కరోనా సమయంలోనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. సినిమా షూటింగ్ కూడా సైలెంట్‌గానే పూర్తి చేసిన సత్యదేవ్ ఇప్పుడు గాడ్సే సినిమాను రిలీజ్‌కు సిద్ధం చేశారు. మే 20న సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.
సి.కె.స్క్రీన్స్ బ్యానర్‌పై సీనియర్ నిర్మాత సి.కళ్యాణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇది వరకే ఈ సినిమా టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. టీజర్ చూస్తే నేటి రాజకీయ నాయకులను, రాజకీయ వ్యవస్థను ప్రశ్నించేలా సినిమా ఉంటుందని క్లియర్ కట్‌గా అర్థమవుతుంది. మరి సినిమాలో రాజకీయ వ్యవస్థను హీరో ఏ మేరకు క్వశ్చన్ చేస్తారనేది పాయింట్. ఎందుకంటే హద్దు మీరి పొలిటీషియన్స్‌ను ప్రశ్నిస్తే సినిమా చుట్టూ వివాదాలు ముగుతాయనడంలో సందేహం లేదు. అదీగాక గాడ్సే అనేది గాంధీజీని చంపిన వ్యక్తి పేరు. మరి ఆ పేరుతో సినిమా టైటిల్ పెట్టడం అంటే కాస్త ఆలోచించదగ్గ విషయమే.
ఇక రిలీజ్ డేట్ పోస్టర్‌ను గమనిస్తే.. సత్యదేవ్ రెండు చేతుల్లో తుపాకులు పట్టుకుని ఇన్‌టెన్స్ లుక్స్‌తో చూస్తున్నారు. మరి ఈ సినిమా సత్యదేవ్‌కి నటుడిగా ఏ మేరకు గుర్తింపు తెచ్చి పెడుతుందనేది చూడాల్సి ఉంది. ఇది వరకు ఉమామహేశ్వరాయ ఉగ్రరూపస్య, తిమ్మరుసు చిత్రాలతో హీరోగా సక్సెస్ అందుకున్న సత్యదేవ్ ఇప్పుడు గుర్తుందా శీతాకాలమ్ వంటి ప్రేమ కథా చిత్రంతో పాటు గాడ్స్ వంటి పొలిటికల్ థ్రిల్లర్ సినిమాలను విడుదలకు సిద్ధం చేశారు.