సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై అందించి చికిత్స అందిస్తున్నారు. గతనెల 30న ఇంట్లో జారిపడటంతో అనారోగ్యానికి గురైన కైకాల కొన్ని రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా మరోసారి ఆయన తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఆసుపత్రిలో చేర్పించారు.