హీరోయిన్ కాజల్ అగర్వాల్ త్వరలోనే తల్లి కాబోతున్న సంగతి తెలిసిందే. 2020 అక్టోబర్30న వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును పెళ్లాడిన కాజల్ ప్రెగ్నెన్సీ కారణంగా ప్రస్తుతం సినిమాలకు దూరమైంది. రీసెంట్‌గానే సీమంతం ఫోటోలను అభిమానులతో పంచుకొని సంతోషం వ్యక్తం చేసింది. ఇక బేబీ కాజల్ కోసం ఆమె ఫ్యామిలీ మొత్తం ఎంతగానో ఎదురుచూస్తుంది.
తాజాగా ఇదే విషయాన్ని కాజల్ చెల్లెలు నిషా అగర్వాల్ సైతం వ్యక్తం చేసింది. నాకు మరో బిడ్డ పుట్టబోతోంది. నా రెండవ బిడ్డ ఆన్ ది వే. నిన్ను కలుసుకోవడానికి ఇంకా వెయిట్ చేయలేను లిటిల్ వన్ అంటూ కాజల్‌తో కలిసి దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. త్వరలోనే పేరెంట్స్‌గా ప్రమోట్ కాబోతున్న కాజల్-కిచ్లు దంపతులకు బెస్ట్ విషెస్ తెలియజేసింది. ప్రస్తుతం నిషా షేర్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.