కాజల్‌కు నానిపై ఇంత అభిమానమా?

kajal agarwal praises on nani over awe Movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నాని నిర్మాణంలో తెరకెక్కిన ‘అ!’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంలో స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌ ఒక ముఖ్య పాత్రలో కనిపించిన విషయం తెల్సిందే. ఈ చిత్రం కొత్త దర్శకుడి దర్శకత్వంలో తెరకెక్కినా, ఒక కొత్త నిర్మాత నిర్మించినా కూడా కాజల్‌ ముఖ్యమైనా పాత్రలో నటించేందుకు ఒప్పుకోవడంను అందరు కూడా ప్రశంసిస్తున్నారు. ఇక ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా కాజల్‌ మీడియా ముందుకు వచ్చింది. ఈ చిత్రం కథ గురించి చెప్పమంటూ ఆమెను మీడియా వారు ప్రశ్నించగా షాకింగ్‌ వ్యాఖ్యలు చేసి మీడియా వారిని ఆశ్చర్యపర్చింది.

‘అ!’ చిత్రం కథ గురించి తనకు తెలియదు అని, తన పాత్ర గురించి మాత్రమే దర్శకుడు చెప్పగా నచ్చి మిగిలిన కథ అడగకుండానే సినిమా చేసేందుకు ముందుకు వచ్చాను అంటూ కాజల్‌ చెప్పుకొచ్చింది. తాను నానిపై అభిమానంతో ఈ చిత్రాన్ని చేశాను అంటూ కాజల్‌ చెప్పుకొచ్చింది. వీరిద్దరు కలిసి నటించింది కూడా పెద్దగా లేదు. అయినా కూడా నాని ఒక్క మాట అడగగానే వెంటనే ఒప్పుకుని నటించేందుకు ముందుకు రావడం ఆమె మంచి మనస్సుకు నిదర్శణం అంటూ కాజల్‌పై సినీ ప్రముఖులు మరియు ప్రేక్షకులు అభినందనలు తెలియజేస్తున్నారు. మంచి పాత్ర కావడం వల్లే కథ కూడా అడగకుండా చేసినంటూ చెబుతున్న కాజల్‌ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని మాత్రం నాని చెబుతున్నాడు. రేపు విడుదల కాబోతున్న ఈ చిత్రం ఫలితం ఏంటీ? కాజల్‌ పాత్ర ఏంటీ అనే విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.