అ! … తెలుగు బులెట్ ప్రివ్యూ

Awe movie preview

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నటీనటులు :     కాజల్ అగర్వాల్, నిత్యా మీనన్, ఇషా, రెజీనా, అవసరాల శ్రీనివాస్ 
నిర్మాతలు :      నాని, ప్రశాంతి త్రిపినేని 
దర్శకత్వం :      ప్రశాంత్ వర్మ 
సినిమాటోగ్రఫీ:    కార్తీక్ ఘట్టమనేని 
ఎడిటర్ :         గౌతమ్ నెరుసు 
మ్యూజిక్ :       మార్క్ కె. రాబిన్ 

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నాని వరుసగా భారీ విజయాలను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. హీరోగా స్టార్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న నాని నిర్మాతగా తన అదృష్టంను పరీక్షించుకోబోతున్నాడు. టాలీవుడ్‌లో పలువురు హీరోలు నిర్మాతలుగా మారారు. వారిలో ఎక్కువ శాతం మంది నిర్మాతలుగా సక్సెస్‌ కాలేదు. కొద్ది మంది మాత్రమే సక్సెస్‌ను దక్కించుకున్నారు. నాని ‘అ!’ చిత్రంతో నిర్మాతగా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. పలువురు స్టార్స్‌ ఈ చిత్రంలో కనిపించడంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

కాజల్‌, నిత్యామీనన్‌, ఇషా, అవసరాల శ్రీనివాస్‌ ఇలా పలువురు స్టార్స్‌ నటించిన ఈ చిత్రంలో నటించడంతో పాటు, భారీ ఎత్తున పబ్లిసిటీ చేయడంతో సినిమాపై అన్ని వర్గాల ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. విభిన్న కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం కోసం రవితేజ మరియు నానిలు వాయిస్‌ ఓవర్‌ చెప్పడంతో పాటు, గెస్ట్‌ రోల్‌లో పలువురు స్టార్స్‌ కనిపించబోతున్నారు. మొత్తానికి సినిమాపై ఆసక్తి కలిగేలా నాని అండ్‌ టీం ప్రమోట్‌ చేశారు. భారీ ఎత్తున ఈ చిత్రం కోసం చేస్తున్న పబ్లిసిటీ కారణంగా భారీ ఓపెనింగ్స్‌ కూడా వచ్చే అవకాశం ఉంది. మరి ఈ చిత్రంతో నాని నిర్మాతగా ఏ మేరకు సక్సెస్‌ను దక్కించుకుంటాడో చూడాలి.