అరవింద సమేత ఆ రెండు హైలైట్‌..

Election Campaign Scene in NTR Aravinda Sametha Veera Raghava

ఎన్టీఆర్‌, పూజా హెగ్డే జంటగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అరవింద సమేత’. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ ముగిసింది. తాజాగా విదేశాల్లో చిత్రీకరించిన పాటతో ఈ సినిమా షూటింగ్‌ పూర్తి అయినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రంలోని ఒక యాక్షన్‌ సన్నివేశం తాజాగా లీక్‌ అయ్యి సినిమాపై అంచనాలను పెంచింది. ఎన్టీఆర్‌లోని ఎమోషన్‌ను ఫుల్‌గా వాడేసిన దర్శకుడు త్రివిక్రమ్‌ సినిమాకే హైలైట్‌గా నిలిచేలా ఆ సీన్‌ను చిత్రీకరించినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో మరో సీన్‌ చాలా ఆసక్తికంగా ఉంటుందని సమాచారం అందుతుంది.

aravinda sametha movie leaks

ఎన్టీఆర్‌ ఈ చిత్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటాడట. కథలో భాగంగా హీరో సన్నిహితుడు లోకల్‌ బాడీ ఎన్నికల్లో పాల్గొంటాడు. ఆ సమయంలో ఎన్టీఆర్‌ ప్రచారంలో పాల్గొంటాడట. ఎన్నికల సీన్‌ చాలా ఆసక్తికరంగా ఉంటుందని సమాచారం అందుతుంది. రంగస్థలం చిత్రంలోని ఎన్నికల సీన్‌ ఎంత మంచి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఈ చిత్రంలో కూడా ఎన్నికల సీన్‌ తప్పకుండా ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. దసరా కానుకగా అక్టోబర్‌ 11న విడుదల కాబోతున్న ఈ చిత్రంలో నాగబాబు కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.