నాని నువ్వు సూపర్‌

positive talk on nani awe movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

యువ హీరో నాని మరోసారి సక్సెస్‌ను దక్కించుకున్నాడు. హీరోగా వరుస విజయాలను దక్కించుకుంటూ దూసుకు పోతున్న తాజాగా నిర్మాతగా కూడా విజయాన్ని సొంతం చేసుకున్నాడు. వాల్‌పోస్టర్‌ బ్యానర్‌పై నాని నిర్మించిన ‘అ!’ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విభిన్న కథాంశంతో, ప్రయోగాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రంకు పాజిటివ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. మాస్‌ ఆడియన్స్‌కు కాస్త అర్థం కానట్లుగా ఉన్నా ఎ మరియు బి క్లాస్‌ ప్రేక్షకులు ఈ చిత్రంకు ఫిదా అవతున్నారు. నాని నిర్మాతగా ఇలాంటి వైవిధ్యభరిత చిత్రాన్ని నిర్మించి నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్నాడు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. 

ఇలాంటి చిత్రాలు నిర్మించేందుకు నిర్మాతలకు ధైర్యం కావాలి. ఇలాంటి ప్రయోగాత్మక చిత్రాలను ప్రేక్షకులు ఆధరిస్తారో లేదో అనే అనుమానంతో ఎక్కువ శాతం నిర్మాతలు ఇలాంటి ప్రాజెక్ట్‌లకు దూరంగా ఉంటారు. కాని నాని తెలుగు సినిమా పరిశ్రమ తనకు ఎంతో ఇచ్చిందని, ఇలాంటి విభిన్న చిత్రాలను నిర్మించి తెలుగు సినిమా పరిశ్రమకు తనవంతు తోడ్పాటు ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఏదైనా ప్రయోగం చేస్తే తప్పకుండా దాన్ని ప్రేక్షకులు ఆధరిస్తారనే విషయం మరోసారి రుజువైంది. నాని ఇలాంటి చిత్రాలను మళ్లీ మళ్లీ నిర్మించాలని కోరుకుంటున్నారు.