ఇండస్ట్రీ చాలా ఇచ్చింది… నేనూ ఇస్తా

nani speech at awe movie promotion

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

యంగ్‌ హీరో నాని స్వశక్తితో ఎదిగి స్టార్‌ ఇమేజ్‌ను తెచ్చుకున్నాడు. టాలీవుడ్‌లో తనకంటూ ఒక బ్రాండ్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ఈ యువ హీరో ఇటీవల కాలంలో ఏ హీరోకు సాధ్యం కాని హిట్స్‌ను దక్కించుకున్నాడు. వరుసగా భారీ విజయాలను దక్కించుకుంటూ దూసుకు వెళ్తున్న నాని తాజాగా నిర్మాతగా కూడా మారాడు. వాల్‌పోస్టర్‌ బ్యానర్‌లో నాని తాజాగా ‘అ!’ అనే చిత్రాన్ని నిర్మించాడు. తనకున్న పరిచయాలతో పలువురు స్టార్స్‌ను ఈ చిత్రంలో దించేశాడు. దాంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగి పోయాయి. నాని పెట్టిన పెట్టుబడికి కనీసం రెండు మూడు రెట్ల లాభాలు రావడం ఖాయం అంటూ ఇప్పటికే తేలిపోయింది.

తాజాగా ‘అ!’ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా నాని మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హీరోగా కెరీర్‌ సూపర్‌ సక్సెస్‌తో దూసుకు పోతున్న సమయంలో ఎందుకు ఇలా నిర్మాతగా ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ ప్రశ్నించగా.. ఇండస్ట్రీ నాకు ఎంతో ఇచ్చింది. ఇండస్ట్రీకి నేను ఏమైనా ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఇలా నిర్మాతగా మారాను. సినిమా ద్వారా వచ్చిన ప్రతి పైసాను సినిమాలకే మళ్లీ పెట్టాలని భావిస్తున్నాను. కొత్త వారిని ప్రోత్సహించడంతో పాటు, కొత్త కథలతో సినిమాలు తీయాలనేది నా కోరిక, టాలీవుడ్‌లో మూస కథలకే ప్రాముఖ్యత దక్కుతుంది. కొత్త కథలు ఎవరైనా తీసుకు వస్తే నిర్మాతలు ఆసక్తి చూపడం లేదు. అందుకే కొత్తగా సినిమాలను నిర్మించేందుకు తాను ముందుకు వచ్చాను అంటూ నాని చెప్పుకొచ్చాడు. ఇక తన నిర్మాణంలో తెరకెక్కే చిత్రాల్లో తాను నటించను అంటూ నాని తేల్చి చెప్పాడు. మొత్తానికి నాని నిర్మాతగా భవిష్యత్తులో పలు చిత్రాలను ఆశించవచ్చు అని తేలిపోయింది.