ప్రభాస్‌తో లింక్‌ పెట్టిన వరుణ్‌

varun tej about nithin and prabhas marriage

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ ‘ఫిదా’, ‘తొలిప్రేమ’ చిత్రాలతో బ్యాక్‌ టు బ్యాక్‌ సక్సెస్‌లు దక్కించుకుని ఫుల్‌ స్వింగ్‌లో దూసుకు పోతున్నాడు. కథల ఎంపికలో జాగ్రత్తలు పడుతూ, దర్శకుల ప్రతిభపై నమ్మకం పెడుతూ వరుణ్‌ తేజ్‌ చిత్రాలను చేసుకుంటూ వెళ్తున్నాడు. తాజాగా తొలిప్రేమ చిత్రం కథ పలువురు తిరష్కరించినా కూడా వరుణ్‌ తేజ్‌ నమ్మి చేయడం జరిగింది. నమ్మకం నిలుపుకున్న వెంకీ అట్లూరి మంచి విజయాన్ని వరుణ్‌కు ఇచ్చాడు. ఇక ఈ మెగా ప్రిన్స్‌ వివాహ విషయమై తాజాగా మీడియా వర్గాల్లో చర్చ జరిగింది. అదే విషయాన్ని ‘తొలిప్రేమ’ ప్రమోషన్‌ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా ఆశ్చర్యకర సమాధానం చెప్పాడు.

ఇండస్ట్రీలో తనకంటే సీనియర్లు చాలా మంది ఉన్నారని, వారి వివాహం అయిన తర్వాత తన వివాహం అన్నాడు. ముఖ్యంగా ప్రభాస్‌ అన్న వివాహం కాకుండా తన పెళ్లి ఎలా జరుగుతుందని చెప్పుకొచ్చాడు. నితిన్‌ కూడా తనకంటే సీనియర్‌ అని, వారి వివాహాలు అయిన తర్వాత నా వివాహం గురించి మీడియా వారు ఆలోచించాల్సిందిగా కోరాడు. ప్రస్తుతం పూర్తి దృష్టి కెరీర్‌పైనే ఉందని, ప్రేమ పెళ్లా, పెద్దలు కుదిర్చిన పెళ్లా అనే విషయంపై కూడా ఆయన క్లారిటీ ఇవ్వలేదు. వరుసగా చిత్రాలు చేయడమే ప్రస్తుతం తనముందున్న లక్ష్యం అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతానికి తాను ప్రేమలో లేను అని, ప్రేమలో పడితే తప్పకుండా మీడియాకు తెలియజేస్తాను అంటూ వరుణ్‌ చెప్పుకొచ్చాడు. మరో అయిదు ఆరు సంవత్సరాల వరకు వరుణ్‌ పెళ్లి మాట ఎత్తేలా లేడని ఆయన మాటల్లో తేలిపోయింది. వరుణ్‌ సోదరి నిహారిక పెళ్లి చేసిన తర్వాత చేసుకుంటాడేమో చూడాలి.