కాజల్‌ ఇలా సెటిల్‌ అవ్వాలనుకుంటుందా?

Kajal Agarwal to pair up with Hero Ram

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
సుదీర్ఘ కాలం పాటు ఇండస్ట్రీలో కొనసాగడం అంటే హీరోయిన్స్‌కు దాదాపు అసాధ్యం. గతంలో హీరోయిన్స్‌తో పోల్చితే ఈతరం హీరోయిన్స్‌ లైఫ్‌ స్పామ్‌ మరింత తక్కువ అని చెప్పక తప్పదు. అయితే ఇలాంటి సమయంలో కాజల్‌ దాదాపు పది సంవత్సరాలుగా స్టార్‌ హీరోయిన్‌గా వెలుగు వెలుగుతూనే ఉంది. కొన్నాళ్లుగా ఈమెకు స్టార్‌ హీరోల సరసన నటించే అవకాశం రావడం లేదు. అయినా కూడా ఇండస్ట్రీలో కొనసాగాలి, మళ్లీ స్టార్‌ హీరోలకు మోస్ట్‌ వాంటెడ్‌ కావాలనే ఉద్దేశ్యంతో ఏ హీరోయిన్‌ కూడా తీసుకోని నిర్ణయాలు తీసుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును దక్కించుకుంటుంది.

మొన్నటి వరకు చరణ్‌, మహేష్‌బాబు, చిరంజీవి వంటి వారంతో నటించిన కాజల్‌ ప్రస్తుతం కళ్యాణ్‌ రామ్‌ వంటి చిన్న హీరోకు ఓకే చెప్పింది. కళ్యాణ్‌ రామ్‌తో సినిమాను సరేలే అనుకుంటే తాజాగా రామ్‌తో ఒక చిత్రాన్ని చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.  నక్కిన త్రినాధ రావు దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మించబోతున్న సినిమాలో కాజల్‌ హీరోయిన్‌గా నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ అమ్మడు త్వరలోనే రామ్‌కు జోడీగా నటించబోతుంది.

దాదాపు వీరిద్దరి కాంబోలో 8 ఏళ్ల క్రితం ‘గణేష్‌’ చిత్రం వచ్చింది. ఆ సినిమా పెద్దగా సక్సెస్‌ కాకపోవడంతో వీరి జంట రిపీట్‌ కాలేదు. మళ్లీ ఇన్నాళ్లకు రామ్‌తో రొమాన్స్‌కు సిద్దం అయ్యింది. యువ హీరోలతో నటించి స్టార్‌ హీరోలతో ఛాన్స్‌లు దక్కించుకున్న ఈ అమ్మడు మళ్లీ చిన్న హీరోలతో నటించి స్టార్స్‌ దృష్టిని ఆకర్షించాలనే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా అనిపిస్తోంది. లేదంటే చిన్న హీరోలతో సినిమాలు చేస్తూ చిన్న హీరోయిన్‌గా సెటిల్‌ అవ్వాలని చూస్తుందేమో అని కొందరు అంటున్నారు.