భారతీయుడు 2 కోసం కాజల్ సాహాసం…!

Kajal Aggarwal Learns Kalari Fight For Indian 2

కాజల్ కవచం సినిమా తరవాత ప్రముఖ తమిళ స్టార్ డైరక్టర్ శంకర్ దర్శకత్వంలో నటించబోతుంది. కమలహాసన్ హీరోగా అప్పట్లో తెరకెక్కిన చిత్రం భారతీయుడు చిత్రం. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ తీసే పనిలో బిజీగా ఉన్నాడు శంకర్. ఈ చిత్రంలో అంతగా ఆకట్టుకునేది కమలహసన్ నటన అండ్ కమల తన చేతి వెళ్ళ తో శత్రువులను మట్టికరిపించే ప్రాచీన యుద్ధ కళ. అదే వర్మ కళ. భారతీయుడు చిత్రంలో కమల్ హసన్ ఎక్కడైనా అనాయ్యం జరిగింది అంటే, అక్కడ శత్రువులను ఈ వర్మ కళ తోనే మట్టికరిపిస్తుంటాడు.

తాజాగా ఈ యుద్ద కళను కాజల్ అగర్వాల్ కూడా నేర్చుకున్నది. భారతీయుడు 2 చిత్రంలో కొన్ని సన్నివేశాల్లో కాజల్ అగర్వాల్ కూడా పోరాటాలు చెయ్యవలసివస్తుంది. కావున కాజల్ చాలా తొందరగా ఈ వర్మ కళ విద్యనూ నేర్చుకుంది. కాజల్ ఇంత తొందరగా ఈ విద్యనూ నేర్చుకోవడంతో చిత్ర బృందం ఆశ్చర్యపోతున్నారు. కమల్ హసన్ కూడా తన చేతి వేళ్ళకు పదును పెడుతున్నాడు. భారతీయుడు 2 సీక్వెల్ లో మలయాళం నటుడు దుల్కర్ సల్మాన్, శింభు కీలక పాత్రలో నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ కూడా ఓ కీలక పాత్రలో కనిపిస్తాడని చిత్రవర్గాల నుండి సమాచారం. భారతీయుడు 2 చిత్రాని లైక ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. వచ్చే ఏడాది జనవరి నుండి సెట్స్ పైకి వెళ్లనున్నది.