సాహో రిలీజ్ పై క్లారిటీ ఇచ్చారు…!

Prabhas Sahoo Movie Release On 15th August 2019

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి చిత్రం తరువాత రన్ రాజా రన్ ఫేం సుజిత్ దర్శకత్వంలో సాహో చిత్రంలో నటిస్తున్నా సంగతి తెలిసిందే. ఈ చిత్రం నుండి ఇటివల ఓ మేకింగ్ వీడియో ను ప్రభాస్ బర్త్ డే సందర్బంగా అతనికి కానుకగా విడుదల చేశారు. ఇంకా అప్పటినుండి ఈ చిత్రం పైన తెగ వార్తలు వస్తునాయి. ప్రభాస్ అభిమానులు కూడా సాహో చిత్రం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుండి ఓ లేటెస్ట్ అప్డేట్ దర్శకనిర్మాతలు అందించారు అదే ఈ చిత్రం యొక్క విడుదల తేది. సాహో చిత్రని వచ్చే ఏడాది ఆగస్ట్ 15 కి విదుదల చేస్తాము అన్నారు.

సాహో చిత్రం హాలీవుడ్ యాక్షన్ తలపించే సిన్స్ ఈ చిత్రంలో చాలానే ఉన్నాయి. భారీ విజువల్స్ అండ్ గ్రాఫిక్స్ కూడినటువంటి చిత్రం సాహో అన్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి శ్రద్ధ కపూర్ ప్రభాస్ సరసన కథానాయకగా గా నటిస్తుంది. ఈ చిత్రంలో శ్రద్ద కపూర్ కొన్ని యాక్షన్ సిన్స్ కూడా చేసిందని చిత్ర వర్గాల నుండి అందుతున్నా సమాచారం. ప్రముఖ బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్… అరుణ్ విజయ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. బాహుబలి చిత్రం తరువాత ప్రభాస్ నటిస్తున్నా చిత్రం కావడంతో ఈ చిత్రం పైన అంచనాలు చాలానే ఉన్నాయి. ఈ చిత్రాని తెలుగు, తమిళం హింది భాషలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం యొక్క విడుదల తేదిపైన క్లారిటీ రావడంతో ప్రభాస్ ఫాన్స్ ఆనందంలో ఉన్నారు.