పిక్ టాక్: సాహో భామకి దిష్ఠి తగలడం ఖాయం

Shraddha Kapoor Foodie Facts

ప్లేట్ ముందు రెండు కూరలు కనిపిస్తేనే ఆవురావుమంటూ తినే భోజనప్రియుల ఎదుట ఒక ఇరవై మూడు కనువిందైన వంటకాలను వడ్డిస్తే ఎలా ఉంటుంది. సరిగ్గా ఇటువంటి పరిస్థితే ఎదురయ్యింది మన సాహో భామ శ్రద్ధా కపూర్ కి. అసలే మీ నాజూకైన శరీరానికి సీక్రెట్ ఏంటి అని అడిగిన ప్రతిసారి పుష్టిగా తినడం అని సమాధానమిచ్చే శ్రద్ధా కపూర్ తిండి విషయంలో ఎటువంటి మొహమాటాలకి పోనని, పుష్టిగా తిని, తర్వాత రోజు జిమ్ లో కరిగిస్తానని చెప్తుంటుంది. ఫుడ్ విషయంలో ఎటువంటి భేషజాలకు పోని శ్రద్ధా కపూర్ కి సాహో సెట్స్ లో కడుపునిండుగా తినే అవకాశం మరోసారి లభించింది.

Shraddha Kapoor Foodie Facts

ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 23 పాత్రల్లో రుచికరమైన వంటకాలను శ్రద్ధా కపూర్ ముందు వడ్డిస్తే, ఏమి తినాలో అనే సందిగ్ధంలో పడినట్టుంది ఇంస్టాగ్రామ్లో తాను చేసిన ఫొటోలోని తన వాలకం చూస్తే. ఇప్పటికే ప్రభాస్ ఇంటినుండి వచ్చిన భోజనానికి ఫిదా అయిపోయిన శ్రద్ధా కపూర్ కి 23 వెరైటీల భోజనం ఎవరు వడ్డించారో తెలియదుగానీ, “ఇది కష్టమే…కానీ మనం షేర్ చేసుకుందాం” అని క్యాప్షన్ పెట్టి మరీ, భోజనాన్ని మిగతావాళ్ళతో పంచుకొని ఒక పట్టు పడతా అంటుంది శ్రద్ధగా భోజనం ముందు కూర్చొని ఫోటో కి పోజిచ్చిన శ్రద్ధా కపూర్. అన్ని ఉన్నా ఏదో వెలితి ఉందనిపిస్తుంది కదా ఆ 23 వంటకాల్ని చూస్తుంటే. బాగానే గమనించారండోయ్. రైస్ ఒక్కటి ఈ వడ్డించిన వంటకాలలో కనిపించడం లేదు. దీన్ని బట్టి చూస్తే, శ్రద్ధా కపూర్ రైస్ ఐటెం తినదని అర్ధమవుతుంది. ఎంతైనా తెలుగువాళ్లు ఎంత భోజనప్రియులో అంతే ఆతిథ్యప్రియులు అనేది తెలిసిన విషయమే కదా. తెలుగు వంటకాల రుచికి సాహో అనాల్సిందే ఈ సాహో భామ.

Shraddha-Kapoor-prabhas