ప్రభాస్, ఛత్రపతి పై క్లారిటీ ఇచ్చిన యష్…!

Yash KGF Movie Box Office Collectio

కన్నడ మాస్ హీరో యాష్ కి కర్ణాటకలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది. తాజాగా ప్రశాంత్ నిల్ దర్శకత్వం లో కేజిఫ్ అనే చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రంలో యాష్ హీరో గా నటించాడు. యాష్ సరసన శ్రీ నిధి హీరోయిన్ గా నటిస్తున్నది. ఈ చిత్రం బంగారు గన్నుల్లో పనిచేసే కార్మికుల జీవితాల గురుంచి తీసిన చిత్రం. ఇటీవల విడుదలైన కేజిఫ్ ట్రైలర్ కు తెలుగు, కన్నడ ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ విషయంలో దర్శకుడు ప్రశాంత్ నిల్ సక్సెస్ అయ్యాడు అని చేపుకోవచ్చు. కన్నడ నుండి డబ్బింగ్ అయిన చిత్రాలు ఇప్పటి వరకు తెలుగు లో ఆడింది లేదు. కానీ కేజిఫ్ ట్రైలర్ కు తెలుగు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తుంది.

yash-prabhas

ఈ చిత్రం సక్సెస్ అయితే మాత్రం యాష్ కి తెలుగు లో మంచి మార్కెట్ ఏర్పడుతుంది అని ట్రేడ్ వర్గాల సమాచారం. రెండు తెలుగు రాష్ట్రాల్లో యాష్ గురుంచి ఓ వార్త సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. యాష్ ఫిజిక్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి దగ్గర పోలికలు ఉండటంతో ఇక్కడ అతన్ని సెకండ్ ప్రభాస్ అంటున్నారు. తాజాగా యాష్ ఇంటర్వ్యూ లో … నాకు మొదటి యష్ అనిపించుకోవడం ఇష్టం అన్నారు. ప్రభాస్ తో పోలిక వద్దని యష్ కోరాడు. ఈ చిత్రం చత్రపతి సినిమాకు దగ్గర పోలికలు ఉన్నాయి అని వస్తున్నా వార్తలపై యష్ కేజిఫ్ చిత్రానికి, చత్రపతి చిత్రానికి ఎలాంటి పోలికలు ఉండవు అని స్పష్టం చేశాడు. ఈ చిత్రం డిసెంబర్ 21 వ తేదిన భారీ స్థాయిలో విడుదలవుతుంది.

kgf-hero-yash