దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ సెకండ్ వేవ్ వేగంగా విరుచుకుపడుతోంది. చిన్నా, పెద్దా, ధనిక, పేద తేడాలు లేకుండా సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు కరోనా గుప్పిట్లో చిక్కుకుంటున్నారు. మొదటి దశతో పోలిస్తే రెండో దశలో సినీ పరిశ్రమపై కరోనా వైరస్ ప్రభావం అధికంగా ఉంది. పరిశ్రమకు చెందిన పలువురు ఒక్కొక్కరుగా కరోనా బారిన పడుతున్నారు. దీంతో పలు షూటింగ్ వాయిదా పడటంతో నటీనటులు మరోసారి ఇంటికే పరిమితమవుతున్నారు.
కాగా హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం ఆచార్యతో పాటు పలు వెబ్ సీరిస్‌లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. షూటింగ్‌లు వాయిదా పడటంతో ఈ భామ తిరిగి ముంబై వెళ్లిపోయింది. ఇక భర్తతో కలిసి ఇంట్లోనే ఉంటున్న కాజల్ తాజాగా ఓ ఆసక్తికర పోస్టును షేర్ చేసింది. ప్రస్తుతం తను ఓ కొత్త అభిరుచికి అలవాటు పడినట్లు వెల్లడించింది. అంతేగాక ఇది తనకు ఎంతో మానసిక ఉల్లాసాన్ని, రిలాక్స్‌ను ఇస్తున్నట్లు చెప్పింది. అదేటంటే తను కొత్తగా అల్లికలు నేర్చుకుందట. ఈ సమయంలో రోజు తను ఇంట్లో అల్లికలు మొదలు పెట్టానంటూ తను అల్లిన ఓ వస్త్రం ఫొటోను షేర్ చేసింది.
‘ప్రస్తుత పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. మన చుట్టూ నిస్సహాయత, ఆందోళన పరిస్థితులు సాధారణం స్థితిగా కనిపిస్తున్నాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో మన మనస్సులను దేని మీదనైనా కేంద్రీకరించడం చాలా ముఖ్యం. అది ఏదైనా కావచ్చు ఉద్దేశపూర్వకమైనవి లేదా సృజనాత్మకమైవి. దీనివల్ల మంచి అనుభూతి పొందడమే కాకుండా ఉపయోగం, ఉత్పాదకత భావాన్ని నెలకొల్పకోవచ్చు. నేను అదే చేస్తున్నాను. ఇటీవల అల్లడం వంటి పని మొదలుపెట్టాను. ఇది నాకు విశ్రాంతి, మానసికోల్లాసాన్ని తీసుకోవడానికి సహాయపడుతుంది’ అంటూ కాజల్ రాసుకొచ్చింది. కాగా కరోనావైరస్ కేసులు గణనీయంగా పెరగడంతో మహారాష్ట్ర ప్రభుత్వం గత నెల లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే.