మంచు విష్ణు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియా సినిమా “కన్నప్ప”. ఈ సినిమా కోసం విష్ణు కఠినంగా కష్టపడుతున్నారు . పైగా ఈ మూవీ లో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ లాంటి ఎంతోమంది అగ్ర నటీనటులు కనిపించనున్న విషయం తెలిసిందే. తాజాగా ఇందులో కాజల్ పాత్ర ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. కాజల్ పార్వతీదేవిగా కనిపించనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా లో శివుడిగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్ నటిస్తున్నారు.
కాగా ఏప్రిల్ 25, 2025న ఈ మూవీ రిలీజ్ కానుంది. ప్రీతి ముకుందన్ ఈ మూవీ లో కథానాయికగా నటిస్తోంది. ఈ ఫాంటసీ యాక్షన్ డ్రామాకి మహా భారత్ సీరియల్‌ని డైరెక్ట్ చేసిన ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై మోహన్ బాబు ఈ మూవీ ని నిర్మిస్తున్నారు. స్టీఫెన్ దేవస్సే, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ‘కన్నప్ప’ సినిమా అత్యధిక భాగాన్ని న్యూజిలాండ్‌లో చిత్రీకరించారు. ఇది భక్తి సినిమా మాత్రమే కాదని, అదొక చరిత్ర అని మోహన్‌బాబు ఒక సందర్భంలో అన్నారు. ఈ సినిమా కి ఆయన నిర్మాతగా వ్యవహరించడంతో పాటు ఒక కీలక పాత్రలో నటించారు.