జగన్ మరో షాక్…సైకిలెక్కనున్న సునీల్…!

Kakinada YCP Leader Sunil Join In TDP

వైసీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డికి మరో షాక్ తగిలింది. కాకినాడ: ఓ వైపు ప్రజా సంకల్ప యాత్ర చేపడుతూ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తూ, ఈసారి ఎలా అయినా సీఎం పదవి అధిష్టించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అదేంటో ఆయన బలొపెథనికీ కృషి చేస్తూ పోతుంటే పార్టీ మాత్రం బలహీనపడుతూ పోతోంది. 2014లో వైసీపీ తరఫున గెలిచిన ఇరవై మందికి పైగా ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇప్పుడు కూడా చాలామంది నాయకులు వైసీపీని వీడి తెలుగుదేశం, జనసేన పార్టీల్లో చేరుతుండగా జగన్ కు తాజాగా కాకినాడ వైసీపీలో కీలక నేతగా పేరున్న చెలమలశెట్టి సునీల్ షాకిచ్చారు. ప్రస్తుతం కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గానికి వైసీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్న ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధం అయ్యిందని తెలుస్తోంది.

jagan-shok
ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని మర్యాదపూర్వకంగా కలిసిన సునీల్, ఆయన ఆశీసులు తీసుకున్నట్టు తెలుస్తోంది. వచ్చే నెల రెండో వారంలో చంద్రబాబు సమక్షంలో సునీల్ టీడీపీ కండువాను కప్పుకోనున్నారని తెలుస్తోంది. చలమశెట్టి సునీల్ తెలుగుదేశం పార్టీలోకి వెళ్తారనే ప్రచారం చాలా రోజులుగా సాగుతోంది. అయితే ఈసారి ఆయన చంద్రబాబుతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. సునీల్ గతంలో రెండుసార్లు కాకినాడ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆయన 2009 ఎన్నికల్లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం తరఫున పోటీ చేసి ఓడిపోయారు. అలాగే గత ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ప్రస్తుత కాకినాడ ఎంపీ తోట నరసింహం చేతిలో 3వేల ఓట్లతో ఓడిపోయారు. సునీల్‌కు స్థానికంగా మంచి పేరు ఉంది. ఓడిపోయినా అందరికీ అందుబాటులో ఉంటారనే పేరు ఆయనకు ఉంది.

cm-chandrababau-naidu