ఎన్టీఆర్‌ కి కళ్యాణ్‌ రామ్‌ ఎంతిచ్చాడో తెలుసా?

kalyan ram giving remuneration to NTR for Jai Lava Kusa movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఎన్టీఆర్‌ త్రి పాత్రాభినయం చేస్తున్న ‘జై లవకుశ’ చిత్రం దసరా కానుకగా మరో రెండు వారాల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. బాబీ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్‌ రామ్‌ ఈ సినిమాను ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌లో నిర్మించాడు. భారీ అంచనాలున్న ఈ సినిమా ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ 120 కోట్లు జరిగినట్లుగా ప్రచారం జరుగుతుంది. కేవలం 50 కోట్ల బడ్జెట్‌ పెట్టిన కళ్యాణ్‌ రామ్‌కు ఏకంగా 70 కోట్ల లాభం సినిమా విడుదలకు ముందే వచ్చిందంటూ ట్రేడ్‌ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. భారీ స్థాయిలో అంచనాలున్న ఈ సినిమా కోసం ఎన్టీఆర్‌ చాలా కష్టపడ్డాడు. అన్నకు గిఫ్ట్‌గా ఈ సినిమాను ఎన్టీఆర్‌ చేస్తున్నాడని, పారితోషికం తీసుకోవడం లేదని మొదటి నుండి వార్తలు వచ్చాయి. కాని అవి పుకార్లే అని తేలిపోయింది.

సినీ వర్గాల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఎన్టీఆర్‌ ఈ సినిమాకు 14 కోట్ల పారితోషికం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. సినిమా ప్రారంభం సమయంలోనే అన్న దమ్ముల మద్య ఈ ఒప్పందం జరిగిందని, సినిమా విజయం సాధించి లాభాలు పొందితే లాభాల్లో వాటా కూడా ఇస్తాను అంటూ కళ్యాణ్‌ రామ్‌ చెప్పాడని, కాని అందుకు ఎన్టీఆర్‌ నో అన్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి అన్నదమ్ముల మద్య కూడా ఆర్థిక పరమైన వ్యవహారం జరిగిందని, ఎన్టీఆర్‌ ఉత్తి పుణ్యానికి మూడు పాత్రలు వేయలేదు అంటూ చెబుతున్నారు.

మరిన్ని వార్తలు:

అర్జున్‌ రెడ్డిని ఇంకా పెంచుతారట!

రానా సోష‌ల్ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

బిగ్‌బాస్‌ ఇంట్లో ముమైత్‌ కోరిక నెరవేరింది