ఎన్టీ రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కబోతున్న ‘ఎన్టీఆర్’ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతున్న విషయం తెల్సిందే. భారీ ఎత్తున అంచనాలున్న ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో బాలకృష్ణ నటిస్తున్న విషయం తెల్సిందే. ఇక చంద్రబాబు నాయుడు పాత్రను రానా పోషిస్తున్నాడు. ఇటీవలే రానా లుక్ విడుదలై అందరి దృష్టిని ఆకర్షించింది. రానా లుక్ రివీల్ అవ్వడంతో పాటు ఎన్టీఆర్‌గా బాలయ్య అద్బుతంగా ఉన్నాడు అంటూ ప్రశంసలు దక్కుతున్న నేపథ్యంలో సినిమాపై అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి. అంచనాలకు తగ్గట్లుగా సినిమా ఉంటుందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఇక ఈ చిత్రంలో హరికృష్ణ పాత్రను కళ్యాణ్ రామ్‌తో చేయిస్తున్నారు.
కళ్యాణ్ రామ్ ఈ చిత్రం కోసం 25 రోజుల డేట్లు ఇచ్చినట్లుగా సమాచారం అందుతుంది. ఈ 25 రోజుల్లో సినిమా చిత్రీకరణ కోసం వరుసగా కళ్యాణ్ రామ్ షూటింగ్లో హాజరు కాబోతున్నాడు. మొదట అనుకున్న దానికంటే హరికృష్ణ పాత్రను కాస్త పెంచుతున్నట్లుగా సినీ వర్గాల్లో ప్రచారం జరిగింది. కాని ఆ విషయమై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఎల్లుండి నుండి సినిమాకు సంబంధించిన చిత్రీకరణలో కళ్యాణ్ రామ్ పాల్గొనబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. సంక్రాంతికి ఈ చిత్రంను విడుదల చేసేందుకు క్రిష్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్టీఆర్ అభిమానులు ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏమాత్రం ఈ చిత్రం విషయంలో అసత్వం తీసుకోకుండా, వెనకాడకుండా భారీ బడ్జెట్‌తో సినిమాను స్వయంగా బాలకృష్ణ నిర్మిస్తున్నాడు. బాలయ్య కెరీర్లోనే ఈ చిత్రం నిలిచి పోవడం ఖాయం.