విలక్షణ నటుడు కమల్‌హాసన్ మరోసారి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఇటీవలె కరోనా నుంచి కోలుకున్న ఆయన మరోసారి ఆసుపత్రిలో చేరడంతో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు కరోనా బారిన పడుతున్న సంగతి తెలిసిందే.
తాజాగా ఆయన చైన్నైలోని ప్రముఖ శ్రీరామచంద్ర హాస్పిటల్లో చేరారు. అయితే ఆయన రెగ్యులర్ చెకప్ కోసం మాత్రమే ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. జనరల్ చెకప్ అనంతరం ఆయన్ను డిశ్చార్జి చేయనున్నట్లు తెలుస్తుంది. కాగా కమల్ హోస్ట్ చేస్తున్న బిగ్‌బాస్ సీజన్5 ఫినాలే ఆదివారం పూర్తయిన సంగతి తెలిసిందే.