రజని పార్టీ ప్రకటనపై కమల్ సింపుల్ రెస్పాన్స్.

Kamal Hassan Simple Response to Rajini Political party

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం మీద కమల్ హాసన్ తొలి స్పందన సానుకూలంగానే వుంది. రజనీని ఓ సోదరుడిలా సంభోదిస్తూ ట్వీట్ చేశారు “ ఓ సోదరా రజని నీ సామాజిక బాధ్యత, రాజకీయ రంగ ప్రవేశం గురించి ఇవే నా శుభాకాంక్షలు “ అంటూ సింపుల్ గా రెస్పాండ్ అయ్యారు. ఓ ఆరేడు నెలల కిందట రజని రాజకీయ రంగ ప్రవేశం గురించి కమల్ కాస్త ప్రతికూలంగానే చర్చించారు. రజని తమిళుడు కాదన్న విషయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ తాను కూడా పార్టీ పెడుతున్నట్టు కమల్ చేసిన రచ్చ అంతాఇంతా కాదు. రజని భావాలు బీజేపీ కి అనుకూలంగా వుంటాయని, తాను అందుకు భిన్నమని చెప్పేందుకు అప్పట్లో కమల్ ప్రయత్నించారు. అయితే కమల్ ఎంత రెచ్చగొట్టినా రజని మౌనంగానే వున్నారు. హడావిడి చేసిన కమల్ ఇప్పుడు పాలిటిక్స్ మీద సైలెంట్ అయిపోతే రజని మాత్రం కొత్త పార్టీ పెట్టబోతున్నట్టు ప్రకటించారు.