Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
విశ్వనటుడు కమల్ హాసన్ రాజకీయ పయనం బీజేపీకి వ్యతిరేకంగానే సాగేట్టు కనిపిస్తోంది. తొలుత రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటించిన తరువాత నా రంగు కాషాయం కాదని కమల్ చెప్పగానే… ఆయన కొత్తగా పెట్టబోయే పార్టీ బీజేపీకి ఆమడదూరంలోనే ఉంటుందని అంతా భావించారు. అయితే… కొన్నిరోజులకే కమల్ మాట మార్చారు. అవసరమైతే బీజేపీతో కలిసి పనిచేయడానికి కూడా సిద్ధమే అని ప్రకటించి కన్ఫూజన్ క్రియేట్ చేశారు. ఆ తర్వాత మాత్రం… బీజేపీకి వ్యతిరేకిస్తూ పరోక్షంగా వ్యాఖ్యలు చేస్తున్నారు.. కేంద్రప్రభుత్వం చేపట్టిన పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని తాను సమర్థించినందుకు దేశప్రజలను కమల్ హాసన్ క్షమాపణలు కోరారు. పెద్ద నోట్ల రద్దు వల్ల లాభపడింది పెద్దలేనని, పేదలు తమ జీవితాలను కోల్పోవాల్సి వచ్చిందని, మొదట్లో తనకు ఈ విషయాలు తెలియక మద్దతిచ్చానని కమల్ హాసన్ చెప్పారు.
బీజేపీ ప్రతిష్టాత్మకంగా భావించిన నిర్ణయాన్ని తప్పబట్టడం ద్వారా… తాను కాషాయదళానికి వ్యతిరేకమని స్పష్టమైన సంకేతాలు పంపారు. తాజాగా మరో విషయంలోనూ కమల్ కేంద్రానికి వ్యతిరేక వైఖరి ప్రదర్శించారు ఇటీవల విడుదలైన విజయ్ మెర్సల్ చిత్రంపై వివాదం తలెత్తింది. బీజేపీ తీసుకున్న అతిపెద్ద నిర్ణయాల్లో ఒకటైన వస్తు సేవల పన్ను జీఎస్ టీ కి సంబంధించి మెర్సల్ చిత్రంలో ఓ డైలాగ్ ఉంది. జీఎస్ టీ వల్ల ఎలాంటి ఉపయోగం లేదన్నట్టుగా హీరో ఓ సందర్భంలో మాట్లాడతాడు. డిజిటల్ ఇండియాపైనా విమర్శలు చేస్తాడు. దీనిపై బీజేపీ మండిపడుతోంది. సినిమాలో డిజిటల్ ఇండియా గురించీ, జీఎస్ టీ గురించి చెప్పినవన్నీ అసత్యాలేనని, ఆ డైలాగులను తొలగించాలని డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ మెర్సల్ కు మద్దతుగా నిలిచారు. మెర్సల్ ను సెన్సార్ బోర్డు ధృవీకరించిందని, మరోసారి సెన్సార్ చేయాల్సిన అవసరం లేదని కమల్ అభిప్రాయపడ్డారు. విమర్శలను ఆపేందుకు ప్రయత్నించకూడదని, వాటికి సమాధానం చెప్పాలని ఆయన పరోక్షంగా కేంద్రప్రభుత్వాన్ని ఉద్దేశించి ట్వీట్ చేశారు. ఈ వ్యాఖ్యలతో కమల్ మరోసారి తను కొత్తగా పెట్టబోయే పార్టీ బీజేపీని ప్రత్యర్థిగానే భావిస్తుందని స్పష్టంచేశారు.
Scene that Modi Govt wants to delete from the Tamil Movie MERSAL which digs on GST, Demonetisation, Yogi Adityanath's BRD death of over 500 childrens
Publié par FekuExpress2.0 sur vendredi 20 octobre 2017