ఇంటినే హాస్పిటల్ గా.. కరోనా పై కమల్ యుద్ధం…

విశ్వనటుడు కమల్ హాసన్ ప్రస్తుతం భారతీయుడు 2 సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ షూటింగ్ సమయంలో జరిగిన క్రేన్ ప్రమాదం తర్వాత ఆ సినిమా షూటింగ్ నిలిచిపోయింది. ఆ తర్వాత కమల్ ప్రమాదానికి సంబంధించిన విషయంలో పోలీసులు తనను బాగా వేధిస్తున్నారని కోర్టులో పిటిషన్ వేశారు.

అయితే ఇప్పుడు ప్రపంచాన్ని వేధిస్తోన్న కరోనా వైరస్ దెబ్బతో సినిమా షూటింగ్ లు పూర్తిగా నిలిచిపోయాయి. ఇప్పటికే మన దేశంలో ఈ కరోనా పాజిటివ్ కేసులు 649 నమోదయ్యాయి.

అదే విధంగా 10మంది వరకు మృత్యువాత పడ్డారు. అయితే తాజాగా కమల్ హాసన్ ఈ వైరస్ తో పోరాడటానికి తన ఇంటినే హాస్పిటల్ గా మార్చుకున్నట్లు తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. దానికి ప్రభుత్వం అంగీకరించాలని విజ్ఞప్తి చేస్తూ ఓ ట్విట్ చేసాడు. అయితే కమల్ తీసుకున్న ఈ నిర్ణయంపైన అక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకొని మరి కొందరు సినీ ప్రముఖులు ముందుకు రావాలని కోరుకోవడం విశేషం.