మీ భక్తికి ఓ పరీక్ష ! అలీ దర్వేష్ దర్గా…

kamar-ali-darvesh-dargah

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

భక్తి తో తలిచి ఏదైనా కార్యం మొదలు పెడితే ఎంతటి మహత్కార్యాన్ని అయినా సాధించవచ్చు. మన సంకల్ప బలం ముందు ఏదైనా బలాదూరే .ఇదేంటి భక్తి పరీక్ష అని టాపిక్ ఇంకో దాంట్లోకి వెళ్తుంది అని కంగారు పడకండి అక్కడికే వస్తున్నాను. మనం దేవుడి పై నమ్మకం ఉంచితే ఏదైనా సిద్ధిస్తుంది .కొండలను పిండి చెయ్యొచ్చు .రాళ్లను ఎత్తనూ వచ్చు.భక్తి కి రాయి ఎత్తడానికి లింకేంటి అనుకుంటున్నారు కదా? .అది ఎంత మాత్రం అసత్యం కాదండి .దేవుడి పేరు ని తలుచుకొని రాయి ఎత్తితే అమాంతంగా గాలి లో కి నిలబడి మనల్ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంది .ఈ వింత ఎక్కడ జరిగింది?జరుగుతుంది అని తెలుసుకోవాలి అని మీకే కాదండి నాకు కూడా కుతూహలమే మరి ఆలస్యం ఎందుకు వివరాల్లోకి వెల్దామా.

Kamar-Ali-Darvesh

సాధారణంగా అయితే మనిషి ఒక రాయిని అది కూడా మాములు గా మహా అయితే పది కిలోలు వరకు ఒక వ్యక్తి లేపవచ్చు కాస్త బలశాలి, ఫహిల్వాన్ అయితే ముప్పై కేజీల వరకు లేపవచ్చు కానీ ఏకంగా తొంబై కేజీ లను లేపాలంటే ఎంత బలశాలి అవ్వాలి అయితే ఒక్కరి వలన కాకపోతే సమూహం గా కూడా లేపవచ్చు ఇంత ఉత్కంఠ రేపే విషయము ఏమిటి అంటే, ఒక దర్గాలో తొంబై కేజీల బరువు కల ఒక రాయి ని పదకొండు మంది సునాయాసంగా లేపగలగడమే. అది కూడా గాలిలో .ఇది ఎలా సాధ్యం అయింది అని మీకు అనుమానం రావొచ్చు అయితే ఇక్కడ అంతా సాధ్యమే, ముందే చెప్పినట్టు భక్తి తో చేసే ఏ పని అయినా విజయవంతం అవుతుంది.

kamar-ali-darvesh-dargah-hi

ఇక ఆ దర్గా ఉన్న ప్రదేశం పూణే. దీన్నే అలీ దర్వేష్ దర్గా అని పిలుచుకుంటారు . ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే తొంబై కేజీల రాయిని లేపడం . అది కూడా ఒక్కరు కాదు ఇద్దరు కాదు పదకొండు మంది ఒకేసారి కేవలం ఒకే వేలితో పైకి లేపగలుగుతారు .రాయిని పదకొండు మంది ముట్టుకొని ఒకే వేలితో “హజరత్ కుమార్ అలీదర్వేష్ ” అని పలుకుతూ రాయి ని పైకెత్తాలి. ఇలా చేసిన మరుక్షణం ఆ రాయి అమాంతం గా ఐదు నుంచి పది అడుగుల ఎత్తులోకి వెళ్లి అలా గాలిలో తేలుతూ ఉంటుంది .ఇది ఎలా సాధ్యం అన్నది ఇప్పటికి మిస్టరీ గా నే మిగిలిపోయింది . ఇక ఈ దర్గా పూణే నుంచి సరిగ్గా ఇరవైఐదు కిలోమీటర్ల దూరం లో, పూణే నుంచి సతారా వెళ్లే హైవే రోడ్ పైన ఉన్నదీ .అదీగాక ఈ దర్గా కి ఏడువందల సంవత్సరాల చరిత్ర ఉన్నట్టు గా చెప్తారు

 మీ భక్తికి ఓ పరీక్ష ! అలీ దర్వేష్ దర్గా... - Telugu Bullet

ఈ దర్గా ని మక్రానా మరియు నల్లని మార్బల్ తో అందం గా శిల్పకళా చాతుర్యం తో నిర్మించారు. కమర్ అలీ దర్వేష్ అనే సూపి మత గురువు సమాధి పొందిన చోటే నేడు కమర్ అలీ దర్వేష్ గా ప్రసిద్ధి పొందినది .ఇది జరిగి దాదాపు 700సంవత్సరాలు అయింది అని చెప్తారు .అలీ దర్వేష్ కి అర్థం జ్ఞానం .సూఫీ తత్త్వాన్ని, నిజమైన ఇస్లాం ని ప్రచారం కావిస్తూ దేవుడికి సేవ చేసుకునే వారే ఈ సూపిలు . పద్దెనిమిది ఏళ్ళ వయసులోనే అతను ఈ లోకాన్ని వదిలి ప్రపంచానికి జ్ఞాన మార్గం చూపించాడు అందుకే అతనిని, సెయింట్ గాను, సూఫీ గాను పిలుస్తారు .

Darvesh-Dargah

ఈ దర్గా లోపల రెండు రాళ్ళూ ఉన్నాయి .చరిత్రకారులు చెప్పేది ఏమిటి అంటే ఆ రెండు రాళ్లను ఎత్తడానికి హజరత్ అలీ దర్వేష్ ఎంతగానో ప్రయత్నించేవాడట .ఇటువంటి విషయాలలో అతనికి ఏమాత్రం ఆసక్తి లేకపోయినప్పటికీ పదే పదే ప్రయత్నించి విఫలం చెందేవాడు .ఈ రెండు రాళ్ళూ కూడా దర్గా ముందు భాగం లో ఉంటాయి .పదకొండు మంది తమ ఇండెక్స్ ఫింగర్ తో కమర్ అలీ దర్వేష్ అని పేరు తలుచుకొని ఎత్తగానే ఒక్కసారే గాల్లో లోకి లేచి అలానే ఉండిపోతుంది .సుమారు గా ఐదు నుంచి పది అడుగుల ఎత్తున లేచి నిలబడుతుంది .

Kamar-Ali-Shah-Darvesh-Baba

ఈ దర్గా లో ఇంకో ప్రత్యేకత ఏమిటి అంటే ఈ దర్గా లో కి మహిళల కి ప్రవేశం లేదు .దానికి కూడా ఒక కధనం ప్రచారం లో ఉన్నది అదేమిటి అంటే అలీ దర్వేష్ తన జీవితాంతం బ్రహ్మ చారి గానే మిగిలిపోయాడని, జీవితం లో ఒక్కసారి కూడా పెళ్లి చేసుకోలేదని అందుకనే ఈ దర్గాలోకి మహిళలకి ప్రవేశం ఉండదు .కుల, మత, జాతి, రంగు, రూపం అలాంటి ఏ బేధం లేకుండా ఎవరైనా ప్రవేశించవచ్చు .ఎలాంటి నియమ నిబంధనలు ఉండవు ..ఈ అరుదైన రాయి ఎత్తడాన్ని చూడడానికి అనేక మంది విదేశీయులు కూడా వస్తూ ఉంటారు .భక్తులకి చాలా గొప్ప నమ్మకం ఈ దర్గా పైన. కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి అని అందుకే ప్రతి ఏడు కనీసం రెండు సార్లు అయినా ఈ దర్గా ని దర్శించి తృప్తి పొందుతారు అనేక వేల మంది భక్తులు.

Ali-Darvesh-Dargah

ప్రతి సంవత్సరం అలీ దర్వేష్ సంవత్సరీకాన్ని ఘనం గా జరుపుతారు .ఆ రోజు పేదలoదరు బాగుండాలని ప్రార్ధన చేస్తారు .ఆ తరువాత అన్న సంతర్పణ చేస్తారు .ఈ ఉత్సవం కోసం అనేక ప్రదేశాలనుంచి వేలాధి గా భక్తులు తరలి వస్తారు .

Pune

ఇక ఈ క్షేత్రానికి ఎలా వెళ్ళాలి అంటే పూణే వరకు రైలు, రోడ్, విమానం ద్వారా వెళ్ళాలి .అక్కడ నుంచి కేవలం 25 కిలోమీటర్ ల దూరం లో నే దర్గా ఉన్నదీ . పూణే నగరానికి దేశం నుంచి అన్ని ప్రదేశాలనుంచి రైల్, రోడ్, విమానం సౌకర్యాలు ఉన్నాయి .భక్తి తో ఏ భారాన్ని అయినా అవలీల గా పైకి ఎత్తి భారాన్ని దించుకోవచ్చు అన్నదానికి ఈ దర్గానే గొప్ప ఉదాహరణ . మరొక పుణ్యస్థలం గురించి మరల తెలుసుకుందాం అంతవరకు అల్విదా .