అతడు నెపోటిజంకి బ్రాండ్ అంబాసిడర్ అంటున్న బాలీవుడ్ క్వీన్

అతడు నెపోటిజంకి బ్రాండ్ అంబాసిడర్ అంటున్న బాలీవుడ్ క్వీన్

బాలీవుడ్ దర్శక, నిర్మాత కరణ్ జొహార్ అంటే కంగనా రనౌత్ కి ఒళ్ళు మంట. అతడు నెపోటిజంకి బ్రాండ్ అంబాసిడర్ అని ఆమె అంటూ ఉంటుంది. ఎక్కడో కాదు అతని ముఖమ్మీద… కాఫీ విత్ కరణ్ షోలో అనేక ఆరోపణలు చేసింది. ఆ తర్వాత కంగనపై జోక్ చేయబోయి కరణ్ కి రివర్స్ కొట్టడంతో వారిద్దరి మధ్య వైరం పెరిగింది.

సుషాంత్ సింగ్ ఆత్మహత్య విషయంలో అతనికి కెరీర్ పరంగా ఆటంకాలు కలిగించాడని నిందారోపణలు సోషల్ మీడియాలో జరుగుతున్నాయి. వాటికి కంగన వంత పాడుతూనే వచ్చింది. అయితే పోలీస్ విచారణలో కరణ్ జొహార్ పేరు ఎక్కడా రాలేదు. అతడిని విచారించాల్సిన అవసరం పడలేదని, ఎవరూ అతని పేరు తీసుకురాలేదని పోలీస్ శాఖ చెప్పింది.

అయితే అతడిని విచారించకుండా ఎందుకుండాలి అంటూ కంగన ఫైర్ అవుతోంది. అతడిని కచ్చితంగా విచారించి తీరాలని డిమాండ్ చేస్తోంది. కంగన గురించి ఇక ఎప్పటికీ ఏమీ మాట్లాడను అని చెప్పిన కరణ్ ఈ డిమాండ్ కి ఆన్సర్ ఇస్తాడేమో చూడాలి.