బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ తన సోదరుడి వివాహంలో సందడి చేసింది. రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్‌లో కంగనా సోదరుడు అక్షత్ రనౌత్ డెస్టినేషన్ వెడ్డింగ్ జరిగింది. ఈ వేడుకలో ఆమె తెగ సందడి చేస్తూ కనిపించారు. పైగా ఎప్పటికప్పుడు ఈ మ్యారేజ్ సెలబ్రేషన్స్ తాలూకు వీడియోలు, ఫోటోలు అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తన సోదరుడి భార్య రీతూను ఫ్యామిలీలోకి స్వాగతిస్తూ నవ వధూవరుల పిక్ షేర్ చేసింది కంగనా.
గురువారం కంగనా సోదరుడు అక్షత్ రనౌత్, రీతూని పెళ్లాడారు. కరోనా కారణంగా అతి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో ఈ పెళ్లి జరిగింది. కంగనాతో పాటు ఆమె తల్లిదండ్రులు, సోదరి రంగోలీ, మరికొందరు కుటుంబ సభ్యులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా తన సోదరుడికి ట్విటర్ వేదికగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపిన కంగనా.. తన స్నేహితులు, అభిమానులంతా కొత్తజంటను ఆశీర్వదించాలని కోరింది. వీరి కొత్త జీవితం గొప్పగా ఉండాలని కంగనా కోరుకుంది కంగనా.