ఆమిర్ ఖాన్ తదుపరి చిత్రం లాల్ సింగ్ చద్దా షూటింగ్ కోసం టర్కీకి వెళ్లిన ఆయన అక్కడి ప్రథమ మహిళ ఎమిన్ ఎర్డోగాన్‌ను కలిసి వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఆమిర్, టర్కీ ప్రథమ మహిళనను కలవడంపై కొంతమంది నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. కశ్మీర్ విషయంలో టర్కీ అధ్యక్షుడు పాకిస్తాన్‌కు మద్దతు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేస్తూ.. భారతదేశంలో స్టార్ నటుడిగా పేరుగాంచిన ఆమిర్ ఇలా చేసి ఉండకూడదంటూ కామెంట్లు చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ సైతం ఆమిర్ ఖాన్ తీరును ఎండగట్టారు. ఇది ఆందోళన కలిగిస్తున్న విషయం అని, దీనిపై ఆమిర్ వెంటనే స్పందించాలని కోరారు. ఓ ఐకాన్‌లా దేశంలో ఎన్నో మన్ననలు అందుకున్నఅమిర్‌ఖాన్ ఇప్పుడు కపటదారిలా మారారంటూ ఫైర్ అయ్యారు. ఈ విషయంపై చాలా మంది మనోభావాలు దెబ్బతింటాయని, అతని చర్యలు చాలామందిని బాధపెడుతున్నాయి అంటూ ట్వీట్ చేశారు.
కాగా కరీనా కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్నారు. టామ్‌హాంక్స్ కథానాయకుడిగా 1994 వచ్చిన హాలీవుడ్ చిత్రం ‘ఫారెస్ట్ గంప్’ చిత్రానికి రీమేక్‌గా ‘లాల్‌సింగ్ చద్దా’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. లాల్ సింగ్ చద్దా సినిమా 2021 క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది. షూటింగ్ నిమిత్తం బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ ప్రస్తుతం తన తదుపరి చిత్రం లాల్ సింగ్ చద్దా షూటింగ్ కోసం టర్కీకి వెళ్లారు. ఈ క్రమంలో టర్కీ ప్రథమ మహిళ ఎమిన్ ఎర్డోగాన్‌ను ఇస్తాంబుల్‌లోని హుబెర్ మాన్షన్‌లో కలిశారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఎమిన్ తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేయడంతో ఇవి కాస్తా వైరల్‌గా మారాయి. భారత్‌కు వ్యతిరేకంగా వ్యవహరించే ఆ దేశ ప్రధానితో మాట్లాడటం ఏంటని ఆమిర్‌ఖాన్ తీరుపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.