ప్రస్తుతం సౌత్ సినిమాలు వరల్డ్ వైడ్‌గా సత్తా చాటుతున్నాయి. బాలీవుడ్లో సైతం దక్షిణాది సినిమాలు ఎంతో క్రేజ్‌ను సంపాదించుకున్నాయి. ఇటీవల విడుదలైన ఆర్ఆర్ఆర్ మూవీ హిందీలో రూ. 100 కోట్ల పైగా కలెక్షన్స్ రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది. ఇక తాజాగా కన్నడ హీరో, రాకింగ్ స్టార్ యశ్ కేజీఎఫ్ 2 అయితే కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసిన కేజీఎఫ్ 2 మేనియానే కనిపిస్తోంది. విడుదలైన 2 రోజుల్లోనే రూ. 100 కోట్ల మార్క్ దాటేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాల్లో కేజీఎఫ్ 2 రెండవ చిత్రంగా నిలిచింది.
దీంతో కేజీఎఫ్ 2పై సాధారణ ప్రేక్షకుల నుంచి సినీ సెలబ్రెటీల వరకు ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా హీరో యశ్‌ను పొగడ్తలతో ముంచేత్తుతున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా యశ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో కేజీఎఫ్ చాప్టర్ 2 పోస్టర్‌ను షేర్ చేసింది. ఈ సందర్భంగా ‘కొన్ని సంవత్సరాలుగా భారత చలన చిత్ర పరిశ్రమ మిస్ అవుతున్న యాగ్రీ యంగ్ మ్యాన్ యశ్. అమితాబ్ బచ్చన్ తర్వాత 1970ల నుంచి ఈ స్థానం ఖాళీగా ఉంది. ఇప్పుడు దానిని యశ్ భర్తీ చేయబోతున్నాడు’ అంటూ అభిప్రాయం వ్యక్తం చేసింది.
ఇక సౌత్ హీరో అయిన యశ్‌ను ఏకంగా బాలీవుడ్ బిగ్‌బీతో పోల్చడంతో ఈ రాక్‌స్టార్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ సందర్భంగా కంగనాకు థ్యాంక్య్కు చెబుతూ తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఇటీవల కంగాన బాలీవుడ్ స్టార్స్‌ను విమర్శిస్తూ సౌత్ స్టార్స్‌పై వరస పోస్టులు పెడుతున్న సంగతి తెలిసిందే. సౌత్ పాన్ ఇండియా స్టార్స్ అల్లు అర్జున్, యశ్‌లు ఫ్యామిలీతో కలిసి పూజ చేస్తున్న ఫొటోలు, చరణ్ అయ్యప్ప దీక్ష, ఎన్టీఆర్ హానుమాన్ దీక్షలో ఉన్న ఫొటోలను షేర్ చేసి.. ‘సౌత్ సూపర్ స్టార్స్ ఎంతో ఒదిగి ఉంటూ.. తమ సంస్కృతిని కాపాడుకుంటూ ఉంటారు’ అంటూ రీసెంట్గా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది.