అంచనాలు పెంచేస్తోన్న ‘మణికర్ణిక’ ట్రైలర్

అంచనాలు పెంచేస్తోన్న 'మణికర్ణిక' ట్రైలర్ - Telugu Bullet

కంగనా రనౌత్ ప్రధాన పాత్రధారిగా ‘మణికర్ణిక’ చిత్రం రూపొందింది. ఝాన్సీ లక్ష్మీబాయి జీవితచరిత్ర ఆధారంగా ఈ సినిమా నిర్మితమైంది. ఈ సినిమాకి చాలావరకూ క్రిష్ దర్శకుడిగా వ్యవహరించి ఆ తరువాత తప్పుకోవడంతో, మిగిలిన భాగానికి కంగనానే దర్శకత్వ బాధ్యతను వహించింది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. యుద్ధ విద్యలో ఝాన్సీ లక్ష్మీబాయి ఆరితేరడం గుర్రపుస్వారిలో నైపుణ్యాన్ని కనబరచడం .. వివాహం .. ఆంగ్లేయ సైన్యంపై విరుచుకు పడటం భర్తను కోల్పోవడం వంటి ఘట్టాలకి సంబంధించిన సన్నివేశాలపై ఈ ట్రైలర్ ను కట్ చేశారు. భారీతనం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. కంగనా ఈ పాత్రలో ఎంతగా ఒదిగిపోయిందనేది ఈ ట్రైలర్ ను చూస్తే తెలుస్తోంది. మీరు కూడా ఒక లుక్ వేసెయ్యండి మరి.