మొత్తం రీ షూట్‌ చేస్తుందట!

manikarnika movie

బాలీవుడ్‌ ప్రతిష్టాత్మక చిత్రం ‘మణికర్ణిక’ గురించి ఈమద్య తెలుగు మీడియాలో తెగ ప్రచారం జరుగుతున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం. అసలు విషయం ఏంటీ అంటే ఈ చిత్రం నుండి తెలుగు దర్శకుడు అయిన క్రిష్‌ను తప్పించి స్వయంగా హీరోయిన్‌ కంగనా రనౌత్‌ దర్శకత్వం చేసేస్తోంది. క్రిష్‌ వర్క్‌ నచ్చని కారణంగా హీరోయిన్‌ కంగనా మరియు నిర్మాతలు ఆయన్ను తప్పించినట్లుగా హిందీ సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుండగా, తెలుగు సినీ వర్గాల్లో మాత్రం క్రిష్‌ వర్క్‌లో కంగనా వేలు పెడుతున్న కారణంగా స్వయంగా క్రిష్‌ తప్పుకున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది. ప్రచారం విషయం పక్కన పెడితే ప్రస్తుతం మణికర్ణిక చిత్రంను మొత్తం తానే అయ్యి కంగనా తెరకెక్కిస్తోంది.

manikarnika movie shooting start

క్రిష్‌ ఆ ప్రాజెక్ట్‌ నుండి తప్పుకోక ముందు సగంకు పైగ చిత్రీకరణ పూర్తి చేశాడు. అయితే ఇప్పుడు ఆ సీన్స్‌ను కూడా కంగనా రీ షూట్‌ చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. నిర్మాతలను ఒప్పించి 25 కోట్ల అదనపు బడ్జెట్‌తో క్రిష్‌ చేసిన సీన్స్‌ను తొలగించి కొత్త సీన్స్‌ను చేస్తున్నట్లుగా బాలీవుడ్‌ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. ప్రస్తుతం యుద్ద సన్నివేశాలకు సంబంధించిన సీన్స్‌ చిత్రీకరణ జరుపతున్నారు. క్రిష్‌ తెరకెక్కించిన సీన్స్‌ను కూడా రీ షూట్‌ చేస్తున్న కారణంగా సినిమా ముందుగా అనుకున్న ప్రకారం జనవరి 25న విడుదల కావడం అసాధ్యం అంటూ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. మణికర్ణిక చిత్రం విషయంలో కంగనా వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు పెద్ద ఎత్తున వ్యక్తం అవుతున్నాయి. కాని ఆమె మాత్రం తన పని తాను అన్నట్లుగా చేసుకుంటూ వెళ్తోంది.