ఎన్‌టి‌ఆర్ తో మణికర్ణికతో ఢీ…!

Manikarnika Movie Release On Republic Day

ఝాన్సీ లక్ష్మీ భాయి జీవితం ఆధారంగా రుపొందుతున్నా చిత్రం మణికర్ణిక జీ స్టూడియోస్ అండ్ కమల్ జైన్, నిశాంత్ పిట్టి సంయుక్తంగా ఈ చిత్రాని నిర్మిస్తున్నారు. కంగనా ముఖ్య పాత్రలో నటిస్తుంది. ఈ చిత్రానికి మొదట క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించాడు. కానీ కొన్ని అనివార్యకారణాల వలన ఈ చిత్రం నుండి తప్పుకున్నాడు. ఆ తరువాత కంగనా పూర్తి చేసింది. ఈ చిత్రం నుండి విడుదలైన టిజర్ కు మంచి రెస్పాన్సు వచ్చింది. ఈ చిత్రం పై ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఒక్కటి సోషల్ మీడియాలో వైరల్ అవ్వుతుంది. ఈ చిత్రాని తెలుగు, తమిళంలో కూడా డబ్బ్ చెయ్యాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తుంది. మణికర్ణిక చిత్రాని రిపబ్లిక్ డే రోజు విడుదల చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు.

manikarnika movie

రిపబ్లిక్ డే ముందు క్రిష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఎన్టీఆర్ మహానాయకుడు జనవరిన 24న విడుదల చేస్తాం అని ముందే ప్రకటించారు. ఎన్టీఆర్ కథానాయకుడు జనవరి 9 న వస్తుంటే మహానాయకుడు రిపబ్లిక్ డే కానుకగా విడుధల చేస్తాం అని ముందే ప్రకటించింది. అయితే మణికర్ణిక కు దర్శకత్వం వహించిన క్రిష్ ఆ చిత్రాన్ని వదిలెయ్యడంతో, ఎన్టీఆర్ మహానాయకుడు పోటిగా మణికర్ణికను విడుదల చెయ్యాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తుందంట. ఎన్టీఆర్ మహానాయకుడు జనవరి 24 న కాకుండా ఫిబ్రవరిలో విడుదల చేస్తారని ఓ టాక్ కూడా వినపడుతుంది. మణికర్ణిక తెలుగులో విడుదలయితే మాత్రం క్రిష్ ఆలోచనలో పడినట్లే అంటున్నారు సినిమా ప్రముఖులు.